Breaking News

జాతీయ కోచ్‌గా భారత దిగ్గజ షూటర్‌

Published on Sun, 02/16/2025 - 13:30

భారత దిగ్గజ షూటర్‌ జస్పాల్‌ రాణా తిరిగి కోచ్‌గా జాతీయ షూటింగ్‌ జట్టుతో చేరాడు. భారత జాతీయ రైఫిల్‌ సమాఖ్య (ఎన్‌ఆర్‌ఏఐ).. జస్పాల్‌ రాణాను 25 మీటర్ల పిస్టల్‌ విభాగానికి ‘హై పెర్ఫార్మెన్స్‌’ కోచ్‌గా నియమించింది. అతడితో పాటు మాజీ ఆటగాడు జీతు రాయ్‌ను కూడా కోచింగ్‌ బృందంలో భాగం చేసింది.

జీతూ ఆటగాడిగా ఆసియా క్రీడల్లో రెండు, కామన్వెల్త్‌ క్రీడల్లో రెండు పతకాలు గెలవడంతో పాటు ఆరు వరల్డ్‌ కప్‌ పతకాలు సాధించింది. అతని ఖాతాలో వరల్డ్‌ చాంపియన్‌íÙప్‌ రజతం కూడా ఉంది. తొలి సారి అతను కోచ్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో జీతూ రాయ్‌ శిక్షణ ఇవ్వనున్నాడు.

రైఫిల్‌ విభాగానికి హెడ్‌ కోచ్‌గా ఇటీవల ద్రోణాచార్య అవార్డు దక్కించుకున్న దీపాలీ దేశ్‌పాండేను ఎంపిక చేసింది. మొత్తంగా ఎన్‌ఆర్‌ఏఐ 16 మంది కొత్త కోచ్‌లను ఎంపిక చేసింది. వీరితో పాటు ఇప్పటికే ఉన్న 19 మందిని కూడా కొనసాగించనున్నారు.

పిస్టల్‌ విభాగంలో జీతు యువ షూటర్లకు శిక్షణ ఇవ్వనుండగా... 10 మీటర్ల రైఫిల్‌ ఈవెంట్‌కు పూజ ఘట్కర్, 25 మీటర్ల పిస్టల్‌ విభాగానికి పెంబా తమాంగ్, స్కీట్‌కు అమరిందర్‌ చీమ, ట్రాప్‌కు వర్ష తోమర్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఇద్దరు హై పెర్ఫార్మెన్స్‌ మేనేజర్లుగా మాన్‌షేర్‌ సింగ్, రోనక్‌ పండిట్‌ను ఎన్‌ఆర్‌ఏఐ నియమించింది. రాణాతో పాటు డీఎస్‌ చండేల్‌ (ఎయిర్‌ రైఫిల్‌), అన్వర్‌ సుల్తాన్‌ (ట్రాప్‌), మనోజ్‌ కుమార్‌ (50 మీటర్ల రైఫిల్‌) హై పెర్ఫార్మెన్స్‌ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు.   

#

Tags : 1

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)