Breaking News

అతడితో పోలికా?.. బుమ్రానే బెస్ట్‌ బౌలర్‌: పాక్‌ మాజీ పేసర్‌

Published on Thu, 03/14/2024 - 21:23

టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రాపై పాకిస్తాన్‌ మాజీ పేసర్‌ మహ్మద్‌ ఇర్ఫాన్‌ ప్రశంసలు కురిపించాడు. ఫాస్ట్‌బౌలర్లకు గాయాలు సహజమేనని.. అయితే, రీఎంట్రీలో బుమ్రా వంటి కొంతమంది మాత్రమే నిలకడగా ఆడగలరని పేర్కొన్నాడు.

పాక్‌ ప్రధాన పేసర్‌, టీ20 జట్టు కెప్టెన్‌ షాహిన్‌ ఆఫ్రిదితో పోలిస్తే.. బుమ్రానే ఉత్తమ బౌలర్‌ అని మహ్మద్‌ ఇర్ఫాన్‌ కుండబద్దలు కొట్టాడు. ‘‘ఫాహిన్‌ ఎప్పుడైనా ఫిట్‌నెస్‌ సమస్యల వల్ల జట్టుకు దూరమైతే.. తిరిగి మైదానంలో దిగినపుడు అతడి బౌలింగ్‌లో పేస్‌ తగ్గుతుంది.

ప్రదర్శన కూడా అంతంతమాత్రంగానే ఉంటుంది. కానీ బుమ్రా అలా కాదు. గాయం నుంచి కోలుకున్న తర్వాత అతడు మరింత గొప్పగా ఆడతాడు. అందుకే వీరిద్దరిలో బుమ్రానే బెస్ట్‌’’ అంటూ ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించాడు మహ్మద్‌ ఇర్ఫాన్‌.

కాగా 2022 ద్వితీయార్థం నుంచి 2023 ప్రథమార్థం వరకు జస్‌ప్రీత్‌ బుమ్రా, షాహిన్‌ ఆఫ్రిది గాయాలతో సతమతమయ్యారు. అయితే, గతేడాది ఆగష్టులో టీమిండియా తరఫున పునరాగమనం చేసిన బుమ్రా అదరగొడుతున్నాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్‌తో ముగిసిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 19 వికెట్లు తీసి సత్తా చాటాడు.

అంతేగాకుండా ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానానికి చేరుకున్నాడీ స్టార్‌ పేసర్‌. ఇక.. వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ 11 మ్యాచ్‌లు ఆడి 20 మంది బ్యాటర్లను అవుట్‌ చేశాడు. మరోవైపు.. షాహిన్‌ ఆఫ్రిది మాత్రం మునుపటిలా రాణించలేక చతికిలపడ్డాడు.

ఇక పాక్‌ టీ20 కెప్టెన్‌గా హోదాలో ఇటీవల న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన షాహిన్‌ ఓటమిని మూటగట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. మహ్మద్‌ ఇర్ఫాన్‌ పాకిస్తాన్‌ తరఫున 2012లో అరంగేట్రం చేశాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తంగా నాలుగు టెస్టుల్లో 10, 60 వన్డేల్లో 83, 22 టీ20 మ్యాచ్‌లలో భాగమై 16 వికెట్లు పడగొట్టాడు.

చదవండి: Mohammed Shami: ఐపీఎల్‌ కోసమే నాటకాలు.. అవునన్న షమీ! వైరల్‌

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)