Breaking News

ధోనీ కాదు.. ‘ఒరిజినల్’ కెప్టెన్ కూల్ అతడే: సునీల్‌ గవాస్కర్‌

Published on Mon, 06/26/2023 - 12:33

భారత క్రికెట్‌లో  'కెప్టెన్ కూల్' అంటే మనకు టక్కున గుర్తు వచ్చేది టీమిండియా మాజీ సారధి ఎంఎస్‌ ధోనినే. అతడు తన కూల్‌ కెప్టెన్సీ భారత జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు. అయితే భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ దృష్టిలో కెప్టెన్ కూల్' అంటే ధోని కాదంట.

భారత్‌కు తొలి ప్రపంచకప్‌ను అందిచిన మాజీ కెప్టెన్‌ కపిల్ దేవ్ అసలైన 'కెప్టెన్ కూల్' గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. 1983 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని నిన్నటికి(జూన్‌25) 40 ఏళ్లు పూరైన సందర్భంగా టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో​గవాస్కర్‌ ఈ వాఖ్యలు చేశాడు.

1983 ప్రపంచకప్‌లో కపిల్ దేవ్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా ఫైనల్‌లో వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను కపిల్ అద్భుతంగా అందుకున్నాడు. అదే మేము వరల్డ్‌ ఛాంపియన్స్‌గా నిలిచేలా చేసింది. ఆ క్యాచ్‌ ఇప్పటికి ఎవరూ మరిచిపోరు. కపిల్‌ ఒక  డైనమిక్‌ లీడర్‌. ఒక కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని క్వాలిటీలు అతడిలో ఉండేవి.

ఒక ఆటగాడు క్యాచ్‌ వదిలినా, మిస్‌ ఫీల్డ్‌ చేసినా.. కపిల్‌ ముఖంపై చిరునవ్వు తప్ప కోపం కనిపించకపోయేది. కపిల్‌ అసలైన కెప్టెన్‌ కూల్‌ అని గవాస్కర్‌ పేర్కొన్నాడు. కాగా 1983 ప్రపంచకప్‌లో అండర్ డగ్స్‌గా బరిలోకి దిగిన టీమిండియా.. అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఫైనల్లో పటిష్ట విండీస్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.
చదవండి: ధోనితో అట్లుంటది మరి.. గంటల వ్యవధిలో అపర కుబేరులను చేశాడు..!

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)