Breaking News

CT: బుమ్రా, కోహ్లి కాదు!.. టీమిండియా ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌ అతడే: డివిలియర్స్‌

Published on Thu, 01/30/2025 - 17:07

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ(ICC Champions Trophy) టోర్నీలో 2000 సంవత్సరంలో తొలిసారి ఫైనల్‌కు చేరింది టీమిండియా. అయితే, కెన్యాలో నాటి తుదిపోరులో న్యూజిలాండ్‌ చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. 2002లోశ్రీలంకతో కలిసి సంయుక్త విజేతగా నిలిచింది. అనంతరం మహేంద్ర సింగ్‌ ధోని(MS Dhoni) సారథ్యంలో 2013లో మరోసారి టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన భారత జట్టు... ఈసారి ఆఖరి గండాన్ని అధిగమించింది.

ఐదు పరుగుల తేడాతో గెలుపొంది
సౌతాఫ్రికా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో నరాలు తెగే ఉత్కంఠ నడుమ కేవలం ఐదు పరుగుల తేడాతో గెలుపొంది.. టైటిల్‌ను సోలోగా సొంతం చేసుకుంది. ఆ తర్వాత మళ్లీ నాలుగేళ్లకు ఫైనల్‌కు చేరినా.. చిరకాల ‍ప్రత్యర్థి పాకిస్తాన్‌ చేతిలో ఓటమిపాలై(India vs Pakistan).. ట్రోఫీని చేజార్చుకుంది. ఈ క్రమంలో మరోసారి ఈ మెగా టోర్నీలో భారత్‌ విజేతగా నిలిచే అవకాశం ముంగిట నిలిచింది.

నాడు ఆ ఆరుగురు
2017 తర్వాత.. దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం నిర్వహిస్తున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో టీమిండియా ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్‌- దుబాయ్‌ వేదికలుగా ఫిబ్రవరి 19 నుంచి మొదలుకానున్న ఈ మెగా ఈవెంట్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇప్పటికే జట్టును ప్రకటించింది. 2017 నాటి జట్టులో ఓపెనింగ్‌ బ్యాటర్‌గా ఉన్న రోహిత్‌ శర్మ ఈసారి కెప్టెన్‌ హోదాలో బరిలోకి దిగనునున్నాడు.

మరోవైపు.. ఆనాటి సారథి విరాట్‌ కోహ్లితో పాటు.. ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా.. పేస్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ కూడా తాజా జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్‌ దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌ అతడే
ఈసారి టీమిండియా ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌ ఎవరన్న అంశంపై అభిప్రాయాలు పంచుకుంటూ.. ఈ ఆరుగురిలో ఒక్కరి పేరు కూడా చెప్పలేదు. వీరికి బదులుగా చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌పై డివిలియర్స్‌ నమ్మకం ఉంచాడు. ఈ మేరకు తన యూట్యూబ్‌ చానల్‌లో మాట్లాడుతూ.. ‘‘ఈసారి భారత జట్టులో ‘ఎక్స్‌’ ఫ్యాక్టర్‌గా కుల్దీప్‌ యాదవ్‌ మారబోతున్నాడని అనిపిస్తోంది.

ఎందుకంటే.. టీమిండియా దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడుబోతోంది. అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు కాస్త అనుకూలంగా ఉంటాయి. కాబట్టి కుల్దీప్‌ ఈసారి ఇండియా తరఫున అందరికంటే మెరుగ్గా ఆడి.. ఫలితాలను ప్రభావితం చేయగలడు’’ అని డివిలియర్స్‌ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పగల సత్తా అతడికి ఉందని పేర్కొన్నాడు.

గాయం కారణంగా
కాగా కుల్దీప్‌ యాదవ్‌ గత కొంతకాలంగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఎడమ గజ్జలో నొప్పి కారణంగా సుదీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్న ఈ స్పిన్‌ బౌలర్‌.. జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నట్లు సమాచారం. గాయం కారణంగానే అతడు ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలోనూ పాల్గొనలేకపోయాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా కుల్దీప్‌ యాదవ్‌ టీమిండియా తరఫున పునరాగమనం చేసే అవకాశం ఉంది.

ఐసీసీ చాంపియన్స్‌ ట్రోపీ-2025కి భారత జట్టు
రోహిత్‌ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, శుబ్‌మన్‌ గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్‌ పంత్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, కుల్దీప్ యాదవ్.

చదవండి: మరో డీఎస్పీ!.. పోలీస్‌ ఉద్యోగంలో చేరిన భారత క్రికెటర్‌

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి