Breaking News

86 సెంచరీలు, 185 హాఫ్ సెంచరీలు చేసిన లెజెండ్‌ కన్ను మూత

Published on Sun, 06/29/2025 - 13:14

ఇంగ్లండ్ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్‌, నార్తాంప్టన్‌షైర్ లెజెండ్ వేన్ లార్కిన్స్(71) క‌న్నుమూశారు. గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డ‌తున్న ఆయ‌న‌.. శ‌నివారం రాత్రి తుది శ్వాస విడిచారు. యూకేలోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌కు చెందిన లార్కిన్స్‌.. 1979 మరియు 1991 మధ్య 13 టెస్టులు, 25 వ‌న్డేలు ఇంగ్లండ్ త‌ర‌పున ఆడాడు.

1979 ప్రపంచ కప్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచిన ఇంగ్లండ్ జ‌ట్టులో లార్కిన్స్ భాగంగా ఉన్నారు. అదేవిధంగా 1989-90 వెస్టిండీస్ పర్యటనలో ఇంగ్లండ్‌కు అద్బుత‌మైన విజ‌యాల‌ను అందించాడు. 1989లో హైదరాబాద్‌లో ఆస్ట్రేలియాపై లార్కిన్స్‌(124) సంచ‌ల‌న సెంచ‌రీతో మెరిశాడు.

ఓవ‌రాల్‌గా ఇంగ్లండ్ త‌ర‌పున ఆయ‌న 1084 ప‌రుగులు చేశాడు. అయితే 1982లో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆదేశాల‌ను ఉల్లంఘించి ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన జ‌ట్టులో లార్కిన్స్ స‌భ్యునిగా ఉన్నాడు. దీంతో ఆయ‌న‌పై మూడు సంవ‌త్స‌రాలు నిషేధం విధించారు. లేదంటే లార్కిన్స్ మ‌రిన్ని మ్యాచ్‌ల‌లో ఇంగ్లండ్‌కు ప్రాతినిథ్యం వ‌హించేవాడు.

కానీ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌, లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మాత్రం ఆయ‌న‌కు అద్బుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. డిమాస్టిక్ క్రికెట్‌లో లార్కిన్స్ పేరిట 85 సెంచ‌రీలు, 182 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. రెండు ఫార్మాట్లు క‌లిపి 40,736 ప‌రుగులు సాధించారు. అటు బౌలింగ్‌లోనూ 119 ప‌డ‌గొట్టారు. ఆయ‌న మృతి పట్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది.
చదవండి: SA vs ZIM: చరిత్ర సృష్టించిన బేబీ ఏబీడీ.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డు

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)