Breaking News

Bumrah-Konstas: పిచ్చి పనులు మానుకోండి: రోహిత్‌ శర్మ ఫైర్‌

Published on Sat, 01/04/2025 - 11:56

టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ఎంతో హుందాగా ఉంటారని కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) అన్నాడు. కానీ అదే పనిగా సహనాన్ని పరీక్షిస్తే మాత్రం ప్రత్యర్థులకు చేదు అనుభవం తప్పదని పేర్కొన్నాడు. తమ జోలికి వచ్చిన వాళ్లకు సరైన రీతిలో బదులివ్వడంలో ఎలాంటి తప్పులేదని బుమ్రా సేనను సమర్థించాడు. కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ(Border Gavaskar Trophy)లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడుతున్న విషయం తెలిసిందే.

ఈ సిరీస్‌లో ఇప్పటికి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి, ఒక టెస్టు డ్రా చేసుకున్న టీమిండియా.. 1-2తో వెనుకబడి ఉంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం సిడ్నీ వేదికగా ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది. 

గెలిస్తేనే కనీసం డ్రా
ఇందులో గెలిస్తేనే టీమిండియా సిరీస్‌ను కనీసం డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, ఫామ్‌లేమి, వరుస ఓటముల నేపథ్యంలో రోహిత్‌ శర్మ విశ్రాంతి పేరిట తనంతట తానే సిడ్నీ టెస్టు నుంచి తప్పుకొన్నాడు.

ఈ నేపథ్యంలో పెర్త్‌లో తొలి టెస్టుకు టీమిండియాకు సారథ్యం వహించిన జస్‌ప్రీత్‌ బుమ్రా(Jasprit Bumrah) మరోసారి పగ్గాలు చేపట్టాడు. ఇక ఐదో టెస్టులో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. మొదటి రోజు ఆటలో భాగంగా 185 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్‌ అయింది. రిషభ్‌ పంత్‌(40), రవీంద్ర జడేజా(26), జస్‌‍ప్రీత్‌ బుమ్రా(22), శుబ్‌మన్‌ గిల్‌(20) రాణించారు.

బుమ్రాపైకి దూసుకు వచ్చిన ఆసీస్‌ బ్యాటర్‌
ఈ క్రమంలో తొలిరోజే ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ మొదలుపెట్టగా యువ ఓపెనర్‌ సామ్‌ కొన్‌స్టాస్‌(Sam Konstas) కాస్త అతి చేశాడు. మరో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో కాస్త ఆగమని చెప్పాడు. 

ఇందుకు బుమ్రా కాస్త అసహనంగా కదలగా.. కొన్‌స్టాస్‌ ఏంటీ అన్నట్లుగా బుమ్రా వైపు దూసుకువచ్చాడు. దీంతో బుమ్రా కూడా బదులిచ్చేందుకు సిద్ధం కాగా.. అంపైర్‌ జోక్యం చేసుకుని నచ్చజెప్పాడు.

అనంతరం బౌలింగ్‌ చేసిన బుమ్రా ఖవాజా వికెట్‌ తీసి .. కొన్‌స్టాస్‌తో.. ‘‘చూశావా? నాతో పెట్టుకుంటే ఎలా ఉంటదో?’’ అన్నట్లు తన ముఖకవళికల ద్వారా మనసులోని భావాలను కాస్త దూకుడుగానే వ్యక్తం చేశాడు. అలా ఆఖరి బంతికి వికెట్‌ తీసి టీమిండియా తొలిరోజు ఆట ముగించింది.

ఈ ఘటనపై రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా స్పందించాడు. బ్రాడ్‌కాస్టర్లతో మాట్లాడుతున్న సమయంలో బుమ్రా- కొన్‌స్టాస్‌ గురించి ప్రస్తావన రాగా.. ‘‘మా వాళ్లు నిర్ణీత సమయం వరకు ఓపికపడతారు. కానీ సహనాన్ని పరీక్షించాలని చూస్తే మాత్రం ఊరుకోరు.

పిచ్చి పనులు మానుకోండి
అనవసరంగా గొడవ పెట్టుకోవాలని చూస్తే.. అంతే ధీటుగా బదులిస్తారు. మేము ఇక్కడకు వచ్చింది క్రికెట్‌ ఆడటానికి మాత్రమే’’ అని బుమ్రా చర్యను సమర్థించాడు. అంతేకాదు.. ‘‘దయచేసి ఇలా చెత్తగా వ్యవహరించకండి. పిచ్చి పనులు మానుకోండి. ఇలాంటివి చూడటానికి అస్సలు బాగోదు’’ అంటూ కంగారూలకు రోహిత్‌ కౌంటర్‌ ఇచ్చాడు.

అదే విధంగా.. ‘‘మా వాళ్లు క్లాసీగా ఉంటారు. ఆటపైనే వారి దృష్టి మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది. ఇక శుక్రవారం ఆస్ట్రేలియాపై ఒత్తిడి పెంచడంలో సఫలమై వికెట్‌ తీయడం సంతోషకరం’’ అని రోహిత్‌ శర్మ తమ జట్టును అభినందించాడు. 

చదవండి: CT 2025: వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ అవుట్‌!.. టీమిండియా కొత్త సారథిగా అతడే!

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)