Breaking News

IND-AUS XI: కోహ్లి, రోహిత్‌కు నో ప్లేస్‌..!

Published on Wed, 10/15/2025 - 18:48

టెస్ట్‌ల్లో, వన్డేల్లో ఆస్ట్రేలియా రెగ్యులర్‌ కెప్టెన్‌ అయిన పాట్‌ కమిన్స్‌ ‍(Pat Cummins) ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటూ రిహాబ్‌లో ఉన్నాడు. కమిన్స్‌ జులైలో వెస్టిండీస్‌ సిరీస్‌ సందర్భంగా గాయపడ్డాడు. ఆతర్వాత ఆసీస్‌ ఆడిన అన్ని మ్యాచ్‌లకు దూరంగా ఉన్నాడు. త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు కూడా ఎంపిక కాలేదు. నవంబర్‌లో జరిగే యాషెస్‌ సిరీస్‌లో తొలి టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు.

అక్టోబర్‌ 19 నుంచి స్వదేశంలో భారత్‌తో జరుగబోయే వన్డే సిరీస్‌కు ముందు కమిన్స్‌ వార్తల్లో నిలిచాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా అతన్ని భారత్‌, ఆస్ట్రేలియా ఆటగాళ్లతో కూడిన ఆల్‌టైమ్‌ వన్డే జట్టును (Cummins All Time India Vs Australia ODI XI) ఎంపిక​ చేయమని అడిగారు.

కమిన్స్‌ ఆశ్చర్యకరంగా వన్డేల్లో ఆల్‌టైమ్‌ గ్రేట్‌ బ్యాటర్లైన విరాట్‌ కోహ్లి (Virat kohli), రోహిత్‌ శర్మను (Rohit Sharma) ఎంపిక చేయలేదు. కమిన్స్‌ ఛాయిస్‌కు క్రికెట్‌ అభిమానులంతా షాకయ్యారు. కోహ్లి, రోహిత్‌ను ఎంపిక చేయని కమిన్స్‌.. భారత దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా ఆల్‌టైమ్‌ గ్రేట్‌ కెప్టెన్ ఎంఎస్‌ ధోని, భారత క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్‌ బౌలర్‌ జహీర్‌ ఖాన్‌ను తన ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ వన్డే జట్టుకు ఎంపిక చేశాడు.

ఈ జట్టులో కేవలం​ ముగ్గురు భారత ఆటగాళ్లకు మాత్రమే చోటు కల్పించిన కమిన్స్‌.. ఎనిమిది మంది ఆస్ట్రేలియన్లకు అవకాశం ఇచ్చాడు. డేవిడ్‌ వార్నర్‌ను సచిన్‌కు జోడీగా ఓపెనర్‌గా ఎంపిక చేసిన కమిన్స్‌.. ఆతర్వాత వరుసగా రికీ పాంటింగ్‌, స్టీవ్‌ స్మిత్‌, షేన్‌ వాట్సన్‌, మైఖేల్‌ బెవన్‌కు మిడిలార్డర్‌లో చోటు కల్పించాడు.

వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా ధోనికి అవకాశం ఇచ్చిన కమిన్స్‌.. జహీర్‌ ఖాన్‌తో పాటు స్పెషలిస్ట్‌ పేసర్లుగా తన దేశానికే చెందిన గ్లెన్‌ మెక్‌గ్రాత్‌, బ్రెట్‌ లీకు చోటు కల్పించాడు. స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌గా దివంగత షేన్‌ వార్న్‌ను ఎంపిక చేశాడు.

కమిన్స్‌ ఆల్‌టైమ్‌ బెస్ట్‌ ఇండియా, ఆస్ట్రేలియా మిక్స్‌డ్‌ వన్డే టీమ్‌..
డేవిడ్ వార్నర్, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, స్టీవ్ స్మిత్, షేన్ వాట్సన్, మైఖేల్ బెవాన్, ఎంఎస్ ధోని, షేన్ వార్న్, బ్రెట్ లీ, జహీర్ ఖాన్, గ్లెన్ మెక్‌గ్రాత్

చదవండి: చెలరేగిన షమీ.. భారత సెలెక్టర్లకు దిమ్మతిరిగే కౌంటర్‌

Videos

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు