Breaking News

ఆసీస్‌, ఇంగ్లండ్‌ వల్ల కాలేదు.. చ‌రిత్ర సృష్టించిన‌ బీసీసీఐ!

Published on Mon, 08/03/2026 - 18:40

భార‌త ఆట‌గాడు అజింక్య ర‌హానే ఇటీవ‌లే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ పొందిన ఆట‌గాళ్లకు బీసీసీఐ పెన్ష‌న్ అందిస్తుంది. ర‌హానే సీనియ‌ర్ టెస్టు  క్రికెట‌ర్ కావ‌డంతో, అత‌డు నెల‌కు పెన్ష‌న్ కింద రూ. 70వేలు అందుకోనున్నాడు. 

ఈ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే క్రికెట్ చ‌రిత్ర‌లో బీసీసీఐ (భార‌త్‌), ఈసీబీ (ఇంగ్లండ్‌), క్రికెట్‌ ఆస్ట్రేలియా క్రికెట్‌ సంప‌న్న బోర్డులుగా గుర్తింపు పొందాయి. కానీ ఈ మూడు బోర్డుల్లో బీసీసీఐ మాత్ర‌మే రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ఆట‌గాళ్ల‌కు గౌర‌వ వేతనం కింద పెన్ష‌న్ అందిస్తుండ‌డం విశేషం.

అటు ఆస్ట్రేలియా కానీ.. ఇటు ఇంగ్లండ్ కానీ త‌మ మాజీ ఆట‌గాళ్ల‌కు ఎలాంటి పెన్ష‌న్ సౌక‌ర్యం క‌ల్పించ‌డం లేదు. దీంతో క్రికెట్ చ‌రిత్ర‌లోనే మాజీ ఆట‌గాళ్ల‌కు పెన్ష‌న్ క‌ల్పిస్తున్న ఏకైక బోర్డుగా బీసీసీఐ చ‌రిత్ర సృష్టించింది. బీసీసీఐ అందిస్తున్న పెన్ష‌న్ విధానాన్ని ఒక‌సారి ప‌రిశీలించి చూద్దాం.

బీసీసీఐ కల్పిస్తున్న పెన్షన్‌ వివరాలు
👉మాజీ క్రికెట‌ర్లు: నెల‌కు రూ. 58,750
👉టెస్టు క్రికెట‌ర్లు: నెల‌కు రూ. 60 వేలు
👉సీనియ‌ర్ టెస్టు క్రికెట‌ర్లు: నెల‌కు రూ. 70 వేలు
👉ఫ‌స్ట్ క్లాస్ క్రికెట‌ర్లు: నెల‌కు రూ. 30 వేల నుంచి 45వేలు
👉అంత‌ర్జాతీయ‌ మ‌హిళా క్రికెట‌ర్లు: నెల‌కు రూ. 52,500
👉దేశ‌వాళీ మ‌హిళా క్రికెట‌ర్లు: నెల‌కు రూ. 45వేలు

ఇక దేశ‌వాళీ క్రికెట్‌లో రాష్ట్రాల వారీగా చూసుకుంటే గుజ‌రాత్ క్రికెట్ అసోసియేష‌న్ త‌మ రాష్ట్రం త‌ర‌ఫున రంజీ ట్రోఫీ ఆడిన 150 మంది మాజీ క్రికెట‌ర్ల‌కు పెన్ష‌న్‌తో పాటు అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తూ ఆద‌ర్శంగా నిలిచింది. మిగతా రాష్ట్రాల బోర్డులు కూడా త‌మ మాజీ క్రికెట‌ర్ల‌కు త‌మ‌కు తోచినంత‌ పెన్ష‌న్ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాయి.

 

Read: ప్రేమకు ఎండ్‌కార్డ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌తో రొనాల్డో పెళ్లి ఎప్పుడంటే?

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)