Breaking News

విభేదాలు ఉంటేనేం.. తనను చాలా మిస్సవుతున్నా: షమీ

Published on Fri, 02/09/2024 - 13:35

తన కూతురు ఐరాను చాలా మిస్సవుతున్నానంటూ టీమిండియా సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ ఉద్వేగానికి లోనయ్యాడు. హసీన్‌ జహాన్‌ అనుమతించినపుడు మాత్రమే బిడ్డను చూసుకునే అవకాశం వస్తుందని పేర్కొన్నాడు. ఐరా తల్లితో తనకు విభేదాలు ఉన్నా.. సొంత రక్తాన్ని మాత్రం వదులుకోలేనని ఎమోషనల్‌ అయ్యాడు.

కాగా మోడల్‌ హసీన్‌ జహాన్‌ను 2014లో వివాహం చేసుకున్నాడు షమీ. ఈ దంపతులకు 2015లో కుమార్తె ఐరా జన్మించింది. అయితే, కొన్నేళ్ల క్రితం భర్త షమీపై సంచలన ఆరోపణలు చేస్తూ హసీన్‌ జహాన్‌ కోర్టును ఆశ్రయించింది.

షమీ స్త్రీలోలుడని.. అతడిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అదే విధంగా గృహహింస చట్టం కింద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరగా విడిగా ఉంటున్నారు.

కుమార్తె ఐరాను హసీన్‌ తనతో పాటు తీసుకువెళ్లడంతో.. షమీ కూతురికి కూడా దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది.  ఈ నేపథ్యంలో తాజాగా న్యూస్‌18తో సంభాషణ సందర్భంగా.. కూతురి ప్రస్తావన రాగా షమీ స్పందించాడు.

‘‘ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని మిస్సవుతారు కదా! కొన్నిసార్లు పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. నేను నా కూతుర్ని మిస్సవుతున్నా. ఎంతైనా తను నా రక్తం. వాళ్ల అమ్మతో విభేదాలున్నంత మాత్రాన నా కూతురిని నేను దూరం చేసుకోలేను. అయితే, నేను ఐరాతో మాట్లాడాలా? వద్దా అనేది వాళ్ల అమ్మ నిర్ణయానుసారమే ఉంటుంది.

తను అనుమతిస్తేనే నేను ఐరాతో మాట్లాడగలను. అయితే, ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా తనను నేరుగా కలవలేకపోయాను. తను ఎ‍క్కడున్నా బాగుండాలని కోరుకుంటా’’ అని షమీ ఉద్వేగానికి లోనయ్యాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 తర్వాత.. గాయం కారణంగా మహ్మద్‌ షమీ.. టీమిండియాకు దూరమయ్యాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తాడని భావించగా ఫిట్‌నెస్‌ సాధించకపోవడంతో ఇప్పట్లో రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

చదవండి: Ranji Trophy: రీ ఎంట్రీలో టీమిండియా ఓపెనర్‌ ధనాధన్‌ శతకం.. ఫోర్ల వర్షం

Videos

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి