Breaking News

ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్‌ బోర్డు.. జెర్సీ స్పాన్సర్‌ చేసే నాథుడే లేడా..?

Published on Thu, 06/01/2023 - 17:51

ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్‌ బోర్డుకు జెర్సీ స్పాన్సర్‌ చేసే నాథుడే కరువయ్యాడు. ప్రతిష్టాత్మకమైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌ కోసం బీసీసీఐ టీమిండియా జెర్సీ స్పాన్సర్‌ను దొరకబట్టలేకపోయింది. ప్రపంచ క్రికెట్‌కు పెద్దన్నలా వ్యవహరించే బీసీసీఐకి ఇది ఘోరమైన అవమానంగా చెప్పాలి. ప్రస్తుతం టీమిండియా జెర్సీ స్పాన్సర్‌గా బైజూస్ కంపెనీ వ్యవహరిస్తుంది. 

అయితే బైజూస్‌ కాంట్రాక్ట్‌ నుంచి అర్ధంతరంగా తప్పుకోవడంతో భారత క్రికెట్‌ బోర్డు కొత్త స్పాన్సర్‌ వేటలో పడింది. కొత్త స్పాన్సర్‌తో డీల్ కుదుర్చుకునేందుకు తగిన  సమయం లేకపోవడంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా ప్లేన్‌ జెర్సీతోనే (బీసీసీఐ, అడిడాస్‌ లోగో ఉంటాయి) బరిలోకి దిగనున్నట్లు సమాచారం. కాగా, బీసీసీఐ ఇటీవలే భారత టూల్ కిట్ స్పాన్సర్‌గా అడిడాస్‌తో డీల్ చేసుకున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే, భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఓవల్‌ మైదానం వేదికగా జూన్‌ 7 నుంచి వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు ఇదివరకే ఓవల్‌ మైదానంలో కఠోరంగా శ్రమిస్తున్నాయి. ఐపీఎల్‌ సక్సెస్‌తో గిల్‌, కోహ్లి, షమీ లాంటి టీమిండియా క్రికెటర్లు ఉరకలేస్తున్నారు. మరోవైపు ఆసీస్‌ టీమ్‌ సైతం విజయంపై ధీమాగా ఉంది.

చదవండి: తండ్రికి ఇచ్చిన మాట కోసం సచిన్‌ ఏం చేశాడంటే..?

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)