Breaking News

T20 WC 2024: శ్రీలంక‌తో మ్యాచ్‌.. భార‌త జ‌ట్టుకు గుడ్ న్యూస్‌

Published on Wed, 10/09/2024 - 07:51

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024లో భార‌త జ‌ట్టు కీల‌క పోరుకు సిద్ద‌మైంది. బుధ‌వారం దుబాయ్ వేదిక‌గా శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టుతో టీమిండియా త‌ల‌ప‌డ‌నుంది. త‌మ సెమీస్ అవకాశాల‌ను మెరుగుప‌రుచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భార‌త్ క‌చ్చితంగా విజ‌యం సాధించాలి. భారీ విజ‌యం సాధిస్తే పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ రెండో స్ధానానికి చేరుకునే అవ‌కాశం ఉంది.

అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గుడ్ న్యూస్ అందింది. ఈ కీల‌క పోరుకు కెప్టెన్ హ‌ర్మాన్ ప్రీత్ కౌర్ అందుబాటులో ఉండ‌నుంది. ఆదివారం పాకిస్తాన్ జ‌రిగిన మ్యాచ్‌లో కౌర్ గాయ‌ప‌డింది. మ్యాచ్ ముగుస్తుంద‌న్న స‌మ‌యంలో హ‌ర్మాన్ మెడ‌కు గాయ‌మైంది. దీంతో ఆమె 29 ప‌రుగులు చేసి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగింది.

ఆ త‌ర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్‌లో కూడా భార‌త సార‌థి పాల్గోన‌లేదు. దీంతో హర్మాన్ శ్రీలంకతో మ్యాచ్‌కు దూరం కానున్న‌ట్లు వార్త‌లు వినిపించాయి. అయితే తాజాగా ఆమె అందుబాటుపై భార‌త వైస్ కెప్టెన్ స్మృతి మంధాన క్లారిటీ ఇచ్చింది.  హ‌ర్మాన్ గాయం అంత తీవ్ర‌మైన‌ది కాద‌ని, ఆమె శ్రీలంక‌తో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌కు అందుబాటులో ఉండ‌నున్న‌ట్లు మంధాన తెలిపింది.

మ‌రోవైపు స్టార్ ఆల్‌రౌండ‌ర్ పూజా వ‌స్త్రాక‌ర్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేద‌ని, లంక‌తో మ్యాచ్‌కూ దూర‌మ‌య్యే అవ‌కాశ‌ముంద‌ని స్మృతి ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో పేర్కొంది. పాక్‌పై ఆడిన భారత జట్టునే లంకతో మ్యాచ్‌కూ కొనసాగించే ఛాన్స్ ఉంది. కాగా పాయింట్ల పట్టికలో టీమిండియా ప్రస్తుతం మూడో స్ధానంలో ఉంది. భారత్ కంటే ముందు న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)