Breaking News

ఆసియాక‌ప్ నుంచి త‌ప్పుకొన్న పాకిస్తాన్‌..?

Published on Thu, 08/07/2025 - 19:20

ఆసియాక‌ప్ హాకీ టోర్న‌మెంట్-2025 టోర్న‌మెంట్‌ నుంచి పాకిస్తాన్ టీమ్ త‌ప్పుకొన్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌ బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ది. అయితే భ‌ద్ర‌తా కార‌ణాల‌ను సాకుగా చూపుతూ ఆసియా కప్ కోసం భార‌త్‌కు ప్రయాణించకూడదని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (PHF) నిర్ణ‌యించుకున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

కాగా తొలుత ఈ టోర్నీలో పాల్గోనేందుకు పాక్ జ‌ట్టు వీసాల‌కు ధ‌ర‌ఖాస్తు చేసింది. ది హిందూ రిపోర్ట్ ప్ర‌కారం.. భార‌త ప్ర‌భుత్వం కూడా పాక్ ఆట‌గాళ్ల వీసాల‌ను ఆమోదించడానికి సిద్దంగా ఉందంట‌. కానీ అంత‌లోనే పాక్ యూట‌ర్న్ తీసుకున్న‌ట్లు స‌మాచారం.

"పీహెచ్ఎఫ్ బుధ‌వారం ఆసియా హాకీ స‌మాఖ్య‌కు ఒక లేఖ రాసింది. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా ఆసియా కప్‌లో పోటీ పడలేమని అందులో పేర్కొంది. త‌మ దేశంలో ఆడేందుకు బంగ్లాదేశ్ హాకీ జ‌ట్టును పాక్ ఆహ్వానించింది" అని హాకీ ఇండియా అధికారి ఒకరు ది హిందూకు తెలిపారు. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు.

కాగా పెహల్గమ్ ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు మరింత తీవ్రమయ్యాయి. అపరేషన్ సింధూర్ పేరిట పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్ధావరాలపై భారత సైన్యం విరుచుకుపడింది. పాక్ ప్రతిస్పందనగా దాడికి యత్నించగా భారత సాయుధ దళాలు తిప్పికొట్టాయి. దాదాపు వారం రోజుల పాటు సరిహద్దు వెంబడి ఉద్రిక్త వాతవారణం నెలకొంది. 

ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణకు  అంగీకరించడంతో పరిస్థితులు కాస్త శాంతించాయి. ఈ క్రమంలో పెహల్గమ్ ఉగ్రదాడికి నిరసనగా వరల్డ్ ఛాంపియన్‌షిప్ లెజెండ్స్ టోర్నమెంట్‌లో పాకిస్తాన్ ఛాంపియన్‌తో మ్యాచ్‌లను ఇండియా లెజెండ్స్ బహిష్కరించింది. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలా మంది సమర్ధించారు. 

అయితే ఆసియాకప్‌-2025 క్రికెట్ టోర్నీలో మాత్రం భారత్‌-పాక్ జట్లు తలపడే అవకాశముంది. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు తాడోపేడో తేల్చుకోనున్నారు. ఈ మ్యాచ్‌ను కూడా భారత్ బాయ్ కాట్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చదవండి: టీమిండియా స్టార్ వికెట్ కీప‌ర్‌కు ప్ర‌మోష‌న్‌.. ఆ జ‌ట్టు కెప్టెన్‌గా

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)