Breaking News

T20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు భార‌త జ‌ట్టు ఇదే..? ఊహించ‌ని ప్లేయ‌ర్‌కు చోటు!

Published on Thu, 04/25/2024 - 17:53

టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024లో భాగ‌మ‌య్యే  భార‌త జ‌ట్టును బీసీసీ సెల‌క్ష‌న్ క‌మిటీ మ‌రో నాలుగు, ఐదు రోజుల్లో ప్ర‌క‌టించే ఛాన్స్ ఉంది. ఈ టోర్నీలో భాగ‌మయ్యే ఆ జ‌ట్లు త‌మ వివ‌రాల‌ను మే 1లోపు ఐసీసీకి స‌మ‌ర్పించాల్సి ఉంది. దీంతో భార‌త జ‌ట్టును ఎంపిక చేసే ప‌నిలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ పడింది. 

ఈ క్ర‌మంలో మాజీ  క్రికెట‌ర్లు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం బార‌త జ‌ట్టును అంచ‌నా వేస్తున్నారు. ఈ జాబితాలోకి తాజాగా టీమిండియా మాజీ స్సిన్న‌ర్ హార్భజన్ సింగ్ చేరాడు.  టీ20 ప్రపంచకప్ కోసం తన 15 మంది సభ్యులతో కూడిన భార‌త జ‌ట్టును భ‌జ్జీ ఎంపిక చేశాడు. ఈ జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, ఓపెన‌ర్ శుబ్‌మ‌న్ గిల్‌, పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌ల‌కు భ‌జ్జీ ఛాన్స్ ఇవ్వ‌లేదు.

వీరితో పాటు స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌ను సైతం హార్భజన్ ఎంపిక చేయలేదు. అయితే అనూహ్యంగా ఈ జట్టులో భజ్జీ  పేసర్ అవేష్ ఖాన్‌కు చోటివ్వడం గమనార్హం. ప్రస్తుత ఐపీఎల్‌లో సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అవేష్ ఖాన్ డెత్ ఓవర్లలో తన బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే  హార్భజన్ అవేష్‌కు చోటిచ్చాడు. ఇక భజ్జీ ఎంపిక చేసిన జట్టులో ఐపీఎల్‌లో అదరగొడుతున్న మయాంక్ యాదవ్‌, శివమ్ దూబే, యశస్వీ జైశ్వాల్‌కు చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను హార్భజన్ ఎంచుకున్నాడు.అదేవిధంగా స్పెషలిస్టు స్పిన్నర్ల కోటాలో కుల్దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌ను హార్భజన్ ఎంపిక చేశాడు.

టీ20 ప్రపంచ కప్ 2024 కోసం హర్భజన్ సింగ్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రా, అవేష్ ఖాన్‌, అర్ష్దీప్ సింగ్, మయాంక్ యాదవ్

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)