Breaking News

అతడు జట్టులో ఉంటాడో లేదో గ్యారంటీ లేదు: జై షా

Published on Sun, 08/18/2024 - 09:53

ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ పేస్ సంచ‌ల‌నం,  ఢిల్లీ యువ ఫాస్ట్ బౌల‌ర్ మ‌యాంక్ యాద‌వ్ అంత‌ర్జాతీయ అరంగేట్రానికి మరింత సమయం పట్టనుంది. ఐపీఎల్‌-2024 సీజ‌న్‌లో తన పేస్‌ బౌలింగ్‌తో మయాంక్‌ అందరని ఆకట్టుకున్నాడు. 

155 కిలోమీటర్ల వేగంతో బంతులు విసిరి ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడిన మయాంక్‌.. 6.99 ఏకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అతడికి జాతీయ జట్టులో అవకాశమివ్వాలని చాలా మంది అభిప్రాయపడ్డారు. 

కానీ అతడి ఫిట్‌నెస్ ప్రధాన సమస్యగా మారింది. తరచుగా గాయాల బారిన పడుతుండటంతో మయాంక్ అరంగేట్రం ఎప్పడన్నది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. తాజాగా మయాంక్‌ డెబ్యూపై బీసీసీఐ కార్యదర్శి జైషా స్పందించాడు. 

అతడి ఎంపికపై తను ఇప్పుడే ఏమి చెప్పలేను అని జైషా తెలిపాడు.  మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. రాబోయే రంజీ సీజన్‌ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు మయాంక్ తీవ్రంగా  శ్రమిస్తున్నాడు.

"మయాంక్ యాదవ్ అరంగేట్రంపై ఇప్పుడే నేనేమి చెప్పలేను. అతడిని ఎంపిక చేస్తారా లేదన్న విషయంపై కూడా నేను హామీ ఇవ్వలేను. ఎందుకంటే మయాంక్‌ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు.

కానీ అతడొక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్‌. ప్రస్తుతం అతడు ఏన్సీఎలో ఉన్నాడు. మా ఫిజియోల పర్యవేక్షణలో అతడు తన పునరావాసాన్ని కొనసాగిస్తున్నాడని" టైమ్స్ ఆఫ్ ఇండియాతో జై షా పేర్కొన్నాడు.

 

 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)