Breaking News

సూర్యతో రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌?.. మాట మార్చిన ‘బ్యూటీ’!

Published on Wed, 12/31/2025 - 14:15

వరుస విజయాలతో జోరు మీదున్నాడు టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌. ద్వైపాక్షిక సిరీస్‌లలో విజయవంతమైన సారథిగా కొనసాగుతున్న ఈ ముంబైకర్‌.. తదుపరి సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీ కానున్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకంగా సాగే ఈ సిరీస్‌లో బ్యాటర్‌గానూ సత్తా చాటి విమర్శలకు చెక్‌ పెట్టాలని సూర్యకుమార్‌ పట్టుదలగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సూర్యకుమార్‌ యాదవ్‌ తన భార్య దేవిశా శెట్టితో కలిసి మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు.

అదే సమయంలో సూర్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌ అయింది. బాలీవుడ్‌, టీవీ నటి ఖుషి ముఖర్జీ.. సూర్యకుమార్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘‘చాలా మంది క్రికెటర్లు నా వెంట పడ్డారు. కానీ నాకు క్రికెటర్‌తో డేటింగ్‌ చేసే ఉద్దేశం లేదు.

సూర్యకుమార్ యాదవ్‌ తరచూ మెసేజ్‌లు చేసేవాడు. అయితే, మా ఇద్దరి మధ్య ఎక్కువగా సంభాషణ జరుగలేదు. నా పేరు వేరొకరితో ముడిపడటం నాకు అస్సలు ఇష్టం ఉండదు’’ అని ఖుషి ముఖర్జీ పేర్కొంది. ఈ వ్యాఖ్యలు వైరల్‌ కావడంతో సూర్యపై కొంతమంది నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. భార్య దేవిశానే ప్రపంచంగా బతికినట్లు కనిపించే సూర్య ఇలాంటి వాడని అనుకోలేదంటూ కామెంట్లు చేశారు.

తన వ్యాఖ్యలు వివాదానికి దారితీయడంతో ఖుషి ముఖర్జీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాజాగా ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. సూర్యకుమార్‌ యాదవ్‌తో తనకు ఎలాంటి రొమాంటిక్‌ రిలేషన్‌షిప్‌ లేదని స్పష్టం చేసింది. తన మాటల్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని.. తమకు నచ్చిన రీతిలో వాటిని వ్యాప్తి చేశారని పేర్కొంది.  

అంతేకాదు.. తన ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయ్యిందన్న ఖుషి.. సూర్యతో తాను ఓ ఫ్రెండ్‌గా మాట్లాడి ఉంటే తప్పేంటని ఎదురు ప్రశ్నించింది. గతంలో తమ మధ్య స్నేహ బంధం ఉండేదని.. అయితే ఇప్పుడు టచ్‌లో లేమని తెలిపింది.

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు