Breaking News

ఢిల్లీకి మారనున్న నితీశ్‌ రాణా

Published on Wed, 06/25/2025 - 16:26

ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించే నితీశ్‌ రాణా.. రానున్న దేశవాలీ సీజన్‌ (2025-26) కోసం జట్టు మారనున్నాడు. రెండేళ్ల క్రితమే ఢిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు మకాం మార్చిన నితీశ్‌ తిరిగి సొంతగూటికి చేరేందుకు సిద్దమయ్యాడు. ఈ మేరకు దేశీయ క్రికెట్‌ వర్గాల్లో బలమైన ప్రచారం జరుగుతుంది. నితీశ్‌కు అత్యంత సన్నితంగా వ్యవహరించే ఓ వ్యక్తి (చిన్ననాటి కోచ్‌ సంజయ్‌ భరద్వాజ్‌) ఈ విషయాన్ని ధృవీకరించాడు. తదుపరి సీజన్‌లో నితీశ్‌ ఢిల్లీ తరఫున ఆడతాడని అతను చెప్పాడు.

31 ఏళ్ల నితీశ్‌ 2023-24 సీజన్‌కు ముందు ఢిల్లీని వీడి ఉత్తర్‌ప్రదేశ్‌కు వలస వెళ్లాడు. గతంలో నితీశ్‌ ఢిల్లీకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. యూపీ తరఫున నితీశ్‌ పెద్దగా రాణించలేకపోయాడు. గత సీజన్‌లో అతను అన్ని ఫార్మాట్లలో దారుణంగా విఫలమయ్యాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీలో 9 మ్యాచ్‌ల్లో 111 పరుగులు.. విజయ్‌ హజారే ట్రోఫీలో 2 మ్యాచ్‌ల్లో 17 పరుగులు.. రంజీ ట్రోఫీలో 4 మ్యాచ్‌ల్లో 150 పరుగులు మాత్రమే చేశాడు. 

పేలవ ప్రదర్శనల కారణంగా నితీశ్‌ యూపీ జట్టులో స్థానం కోసం పాకులాడాల్సి వచ్చేది. ఎవరైనా మిడిలార్డర్‌ బ్యాటర్‌ గాయపడితేనే నితీశ్‌కు అవకాశాలు వచ్చేవి. దీంతో ఉపయోగం లేదని అనుకున్న నితీశ్‌ సొంతగూటికి తిరిగి రావడానికి సిద్దమయ్యాడు.

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో నితీశ్‌కు ఢిల్లీ జట్టులో గతంలోలా తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పేలవ ఫామ్‌, జట్టును అకారణంగా వీడాడన్న కారణాల చేత ఢిల్లీ యాజమాన్యం నితీశ్‌ను గతంలో ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవచ్చు. ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన ఓ వ్యక్తి నితీశ్‌ను ఉద్దేశిస్తూ.. ఇదేమీ డంప్‌ యార్డ్‌ కాదని సంచలన కామెంట్లు చేశాడు. 

దీన్ని బట్టి చూస్తే నితీశ్‌ ఢిల్లీ జట్టులో చేరినా అతని కెరీర్‌ నల్లేరుపై నడకలా ఉండకపోవచ్చు. నితీశ్‌ త్వరలో జరుగున్న ఢిల్లీ ప్రీమియర్‌ లీగ్‌లో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఈ దేశీయ లీగ్‌లో అతను సత్తా చాటగలిగితే ఢిల్లీ దేశవాలీ జట్టులో పూర్వవైభవం సాధించవచ్చు.

నితీశ్‌ వర్సెస్‌ ఢిల్లీ కెప్టెన్‌
ఒకవేళ నితీశ్‌ ఢిల్లీ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా అతని పరిస్థితి అంత ఆశాజనకంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే నితీశ్‌ ఢిల్లీ సారధి ఆయుశ్‌ బదోనితో గొడవపడ్డాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ సందర్భంగా నితీశ్‌, బదోని బాహాబాహీకి దిగినంత పని చేశారు. ఆ సమయంలో అంపైర్లు సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.

ఐపీఎల్‌లోనూ అదే ప్రదర్శన
నితీశ్‌ తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ పేలవ ప్రదర్శనను కొనసాగించాడు. ఈ సీజన్‌కు ముందు రాజస్థాన్‌ రాయల్స్‌ అతన్ని రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే అతను సామర్థ్యం మేరకు రాణించలేకపోయాడు. 11 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 217 పరుగులు మాత్రమే చేశాడు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)