Breaking News

నితీష్ విధ్వంసకర సెంచరీ.. 15 సిక్స్‌లతో వీర విహారం! వీడియో

Published on Sat, 08/30/2025 - 08:54

ఢిల్లీ ప్రీమియ‌ర్ లీగ్‌-2025లో వెస్ట్ ఢిల్లీ లయ‌న్స్ జ‌ట్టు క్వాలిఫ‌య‌ర్ 2కు ఆర్హ‌త సాధించింది. శుక్ర‌వారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా ఎలిమినేట‌ర్‌లో సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్‌పై 7 వికెట్ల తేడాతో వెస్ట్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. దీంతో శనివారం క్వాలిఫయర్‌-2లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్‌తో వెస్ట్ ఢిల్లీ తలపడనుంది.

కాగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్‌స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. సౌత్‌ ఢిల్లీ సూపర్‌స్టార్‌ బ్యాటర్లలో అన్మోల్ శర్మ(55), తేజస్వి దహియా(33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 60) హాఫ్‌ సెంచరీలతో మెరవగా.. సుమిత్ మాథుర్(26 బంతుల్లో48) మెరుపులు మెరిపించాడు. వెస్ట్‌ ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శుబ​​మ్‌ దుబే, శివాంక్‌, అనిరుద్‌ చౌదరి తలా వికెట్‌ సాధించారు.

నితీష్‌ విధ్వంసం..
అనంతరం 202 పరుగుల లక్ష్య చేధనలో వెస్ట్‌ ఢిల్లీ 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెస్ట్‌ ఢిల్లీ కెప్టెన్‌ నితీష్‌ రాణా విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.అరుణ్‌ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రాణా కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు.

ఓవరాల్‌గా 55 బంతులు ఎదుర్కొన్న నితీష్‌.. 8 ఫోర్లు, 15 సిక్స్‌ల సాయంతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో 202 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్‌ ఢిల్లీ 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.
చదవండి: ZIM vs SL: శ్రీలంక‌ను వ‌ణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓట‌మి


 

 

Videos

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)