Breaking News

విధ్వంసం సృష్టించిన కమిందు, లియనాగే.. శ్రీలంక భారీ స్కోర్‌

Published on Fri, 08/29/2025 - 17:03

రెండు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో ఇవాళ (ఆగస్ట్‌ 29) జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక భారీ స్కోర్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక ని​ర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. 

ఓపెనర్‌ పథుమ్‌ నిస్సంక (92 బంతుల్లో 76; 12 ఫోర్లు) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో రాణించగా.. ఆఖర్లో జనిత్‌ లియనాగే (47 బంతుల్లో 70 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కమిందు మెండిస్‌ (36 బంతుల్లో 57; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. 

లియనాగే, మెండిస్‌ ఆరో వికెట్‌కు 83 బంతుల్లో 137 పరుగులు జోడించి, స్కోర్‌ను 300 పరుగుల సమీపానికి చేర్చారు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి కమిందు ఔట్‌ కాకపోయుంటే స్కోర్‌ 300 దాటేదే.

ఈ మ్యాచ్‌లో శ్రీలంకకు ఆదిలోనే షాక్‌ తగిలింది. 13 బంతులు ఆడిన ఓపెనర్‌ నిషాన్‌ మధుష్క డకౌటయ్యాడు. ఆతర్వాత నిస్సంక.. కుసాల్‌ మెండిస్‌ (38), సదీర సమరవిక్రమతో (35) ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. కుసాల్‌తో 100 పరుగులు, సమరవిక్రమతో 30 పరుగులు జోడించాడు. 

అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్‌ అసలంక 6 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. ఆఖర్లో కమిందు, లియనాగే చెలరేగి భారీ స్కోర్‌ అందించారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ నగరవ 2 వికెట్లు తీయగా.. బ్లెస్సింగ్‌ ముజరబానీ, ట్రెవర్‌ గ్వాండు, సికందర్‌ రజా, సీన్‌ విలియమ్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, శ్రీలంక జట్టు 2 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లలో రెండో వన్డే ఆగస్ట్‌ 31న, మూడు టీ20లు సెప్టెంబర్‌ 3, 6, 7 తేదీల్లో జరుగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు హరారే వేదికగానే జరుగనున్నాయి. 

ఆసియా కప్‌కు ముందు శ్రీలంకకు ఈ సిరీస్‌ ప్రాక్టీస్‌గా ఉపయోగపడనుంది. ఈ సిరీస్‌ పూర్తైన వెంటనే శ్రీలంక నేరుగా యూఏఈకి వెళ్లనుంది. 

జింబాబ్వే విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌తో దాదాపు నాలుగేళ్ల తర్వాత వన్డేల్లోకి రీఎంట్రీ ఇచ్చిన వెటరన్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ బ్రెండన్‌ టేలర్‌.. మ్యాచ్‌ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే గాయంతో వైదొలిగాడు. ఈ మ్యాచ్‌కు ముందు రెగ్యులర్‌ కెప్టెన్‌ క్రెయిగ్‌ ఎర్విన్‌ కూడా గాయం కారణంగానే వన్డే సిరీస్‌ మొత్తానికి దూరమయ్యాడు. ఎర్విన్‌ స్థానంలో వన్డే సిరీస్‌లో సీన్‌ విలియమ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)