Breaking News

చెలరేగిన భారత బౌలర్లు.. 132 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్‌

Published on Sun, 11/16/2025 - 17:12

రాజ్‌కోట్ వేదిక‌గా సౌతాఫ్రికా-ఎతో జ‌రుగుతున్న రెండో అనధికారిక వన్డేలో భార‌త్‌-ఎ బౌల‌ర్లు నిప్ప‌లు చెరిగారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికా-ఎ జ‌ట్టు.. భార‌త బౌల‌ర్ల ధాటికి 30.3 ఓవ‌ర్ల‌లో కేవ‌లం 132 పరుగులకే కుప్ప‌కూలింది. యువ ఆల్‌రౌండ‌ర్ నిశాంత్ సింధు అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌ద‌ర్శన క‌న‌బ‌రిచాడు.

 సింధు త‌న స్పిన్ బౌలింగ్‌తో ప్ర‌త్య‌ర్ధి బ్యాట‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టాడు. ఈ హ‌ర్యానా ఆట‌గాడు 7 ఓవ‌ర్లు బౌలింగ్ చేసి కేవ‌లం 16 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చి 4 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అత‌డితో పాటు హర్షిత్ రాణా మూడు, ప్ర‌సిద్ద్ కృష్ణ రెండు వికెట్లు సాధించారు.

సౌతాఫ్రికా బ్యాటర్లలో మూన్‌స్వామి(33) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పొటిగిటర్‌(23), ప్రిటోరియస్‌(21) రాణించారు. మొత్తం ఐదుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌ స్కోర్‌కే పరిమితమయ్యారు. కాగా తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా-ఎ జట్టును 4 వికెట్ల తేడాతో భారత్‌ చిత్తు చేసింది. ప్రస్తుతం మూడు మ్యాచ్‌ల సిరీస్‌ మెన్‌ ఇన్‌ బ్లూ 1-0 ఆధిక్యంలో ఉంది.

తుది జట్లు
భారత్‌
రుతురాజ్ గైక్వాడ్, అభిషేక్ శర్మ, ఆయుష్ బదోని, తిలక్ వర్మ(కెప్టెన్‌), ఇషాన్ కిషన్‌(వికెట్ కీపర్‌),  నితీష్ కుమార్ రెడ్డి,నిశాంత్ సింధు,హర్షిత్ రాణా, విప్రజ్ నిగమ్,అర్ష్‌దీప్ సింగ్,ప్రసిద్ కృష్ణ

సౌతాఫ్రికా
రివాల్డో మూన్సామి(వికెట్ కీపర్‌), లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్డాన్ హెర్మాన్, మార్క్వెస్ అకెర్మాన్(కెప్టెన్‌), సినెథెంబ క్వెషిలే, డయాన్ ఫారెస్టర్, ప్రెనెలన్ సుబ్రాయెన్, లూథో సిపమ్లా, డెలానో పోట్గీటర్, న్కాబయోమ్జి పీటర్, ఒట్నీల్ బార్ట్‌మన్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)