ఇదేమి సిక్స్‌రా బాబు.. దెబ్బకు స్టేడియం బయటకు బంతి! వీడియో వైరల్‌

Published on Sat, 01/27/2024 - 16:33

ఇంటర్నేషనల్ లీగ్-2024లో ఎంఐ ఎమిరేట్స్ వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం షార్జా వేదికగా షార్జా వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో ఎమిరేట్స్‌ ఘన విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన షార్జా.. ముంబై బౌలర్ల దాటికి  12.1 ఓవర్లలో కేవలం 74 పరుగులకే కుప్పకూలింది.

ఎంఐ బౌలర్లలో స్పిన్నర్‌ అకిల్‌ హోస్సేన్‌ 4 వికెట్లతో చెలరేగగా.. బౌల్ట్‌, సలీమీఖాల్‌ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఎమిరేట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో కుశాల్‌ పెరీరా, ఫ్లెచర్‌ చెరో 42 పరుగులతో టాప్‌ స్కోరర్లగా నిలిచారు.

నికోలస్‌ పూరన్‌ భారీ సిక్సర్‌..
కాగా ఈ మ్యాచ్‌లో ఎమిరేట్స్‌ కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ భారీ సిక్సర్‌ బాదాడు. ఎంఐ ఇన్నింగ్స్‌ 19 ఓ‍వర్‌లో క్రిస్‌ వోక్స్‌ వేసిన యార్కర్‌ను.. పూరన్‌ మిడ్‌ వికెట్‌ మీదగా 102 మీటర్ల భారీ సిక్సర్‌ కొట్టాడు. దెబ్బకు బంతి స్టేడియం బయట పడింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఈ మ్యాచ్‌లో పూరన్‌ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.


 

Videos

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)