Breaking News

నికోలస్‌ పూరన్‌ ఊచకోత.. 6 ఫోర్లు, 7 సిక్సర్లతో..!

Published on Mon, 09/23/2024 - 09:11

కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2024లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ మరో విజయాన్ని సొంతం​ చేసుకుంది. సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌తో ఇవాళ (సెప్టెంబర్‌ 23) జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పేట్రియాట్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 

ఆండ్రీ ఫ్లెచర్‌ (61 బంతుల్లో 93; 4 ఫోర్లు, 6 సిక్సర్లు), కైల్‌ మేయర్స్‌ (30 బంతుల్లో 60; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. రిలీ రొస్సో 20, మికైల్‌ లూయిస్‌ 10, ఎవిన్‌ లూయిస్‌ 2 పరుగులు చేశారు. నైట్‌రైడర్స్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డన్‌ 2, జేడన్‌ సీల్స్‌, అకీల్‌ హొసేన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం 194 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నైట్‌రైడర్స్‌.. నికోలస్‌ పూరన్‌ (43 బంతుల్లో 93 నాటౌట్‌; 6 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. జేసన్‌ రాయ్‌ (34 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కీసీ కార్టీ 13, టిమ్‌ డేవిడ్‌ 9, కీరన్‌ పోలార్డ్‌ 10 పరుగులు చేశారు. పేట్రియాట్స్‌ బౌలర్లలో కైల్‌ మేయర్స్‌, అన్రిచ్‌ నోర్జే, తబ్రేజ్‌ షంషి తలో వికెట్‌ పడగొట్టారు.

కాగా, ప్రస్తుత మ్యాచ్‌ గెలుపుతో సంబంధం లేకుండా నైట్‌రైడర్స్‌ ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. నైట్‌రైడర్స్‌తో పాటు సెయింట్‌ లూసియా కింగ్స్‌, గయానా అమెజాన్‌ వారియర్స్‌, బార్బడోస్‌ రాయల్స్‌ ఈ సీజన్‌ ప్లే ఆఫ్స్‌కు చేరాయి. ఆంటిగ్వా అండ్‌ బార్బుడా ఫాల్కన్స్‌, సెయింట్‌ కిట్స్‌ అండ్‌ నెవిస్‌ పేట్రియాట్స్‌ ఈ సీజన్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాయి. ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు అక్టోబర్‌ 1, 2, 4 తేదీల్లో జరుగనున్నాయి. అక్టోబర్‌ 6న ఫైనల్‌ జరుగుతుంది.

చదవండి: క్లీన్‌ స్వీప్‌ పరాభవం తప్పించుకున్న సౌతాఫ్రికా

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)