Breaking News

నికోలస్‌ పూరన్‌ సంచలన నిర్ణయం!

Published on Thu, 11/05/2026 - 13:15

వెస్టిండీస్ మాజీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ నికోల‌స్ పూర‌న్ కేవ‌లం 29 ఏళ్ల వ‌య‌స్సులోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచిన సంగ‌తి తెలిసిందే. అయితే పూర‌న్ ఇప్పుడు త‌న రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. మళ్లీ జాతీయ జట్టులోకి తిరిగి వచ్చేందుకు ఛాన్స్ ఉంద‌ని పూర‌న్ తాజాగా సంకేతాలిచ్చాడు.

పూర‌న్ ఇటీవ‌ల  ‘నిక్కీ పీ బ్యాటింగ్ అకాడమీ’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు. ఈ సంద‌ర్భంగా అత‌డికి త‌న రిటైర్మెంట్ యూట‌ర్న్ గురుంచి ప్ర‌శ్న ఎదురైంది. అయితే షాయ్ హోప్ నాయకత్వంలోని వెస్టిండీస్ జట్టు తరఫున మళ్లీ ఆడే అవకాశంపై పూరన్ సానుకూలంగా స్పందించాడు.

"అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వ‌చ్చేందుకు ఇంకా త‌ల‌పులు తెరిచే ఉన్నాయి. కాలం చాలా వేగంగా మారుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ ప్ర‌స్తుతం నా దృష్టి అంతా అకాడమీలో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంపైనే ఉంది" అని పూర‌న్ పేర్కొన్నాడు.

అదేవిధంగా యువ క్రీడకారుల‌ను ఉద్దేశించి మాట్ల‌డుతూ.. ఒక అథ్లెట్‌గా ప్రతికూల పరిస్థితులను సాకులుగా చూపకూడదని, మైదానంలో దిగిన ప్ర‌తీసారి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాలని పూరన్ సూచించాడు.

కాగా పూర‌న్ ప్ర‌స్తుతం ప్ర‌పంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులో అత‌డు స‌భ్యునిగా ఉన్నాడు. అయితే క‌రేబియ‌న్ క్రికెట‌ర్‌కు వైట్‌బాల్ క్రికెట్‌లో అద్భుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. పూరన్ విండీస్ త‌ర‌పున‌ 61 వన్డేలలో 39.66 సగటుతో 1983 పరుగులు చేశాడు. 

ఇందులో మూడు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదేవిధంగా 106 అంత‌ర్జాతీయ టీ20 మ్యాచ్‌ల‌లో  136.39 స్ట్రైక్ రేటుతో 2275 పరుగులు చేశాడు. అలాగే విండీస్ టీ20 జ‌ట్టుకు అత‌డు నాయ‌క‌త్వం కూడా వ‌హించాడు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)