Breaking News

చ‌రిత్ర సృష్టించిన పూరన్‌.. సెహ్వాగ్ రికార్డు బద్దలు

Published on Tue, 04/08/2025 - 20:49

ఐపీఎల్‌-2025లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్‌ నికోల‌స్ పూర‌న్ త‌న సూప‌ర్ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పూర‌న్ విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై పూరన్ విరుచుకుపడ్డాడు.

అద్భుతమైన అభిమానులను అలరించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 36 బంతుల్లోనే పూర‌న్ 7 ఫోర్లు, 8 సిక్స‌ర్లతో 87 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ తుపాన్ ఇన్నింగ్స్‌తో పూరన్ ఐపీఎల్‌లో రెండు వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.

త‌ద్వారా ఓ అరుదైన రికార్డును పూర‌న్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 ప‌రుగుల (బంతుల ప‌రంగా) మైలు రాయిని అందుకున్న రెండో ప్లేయ‌ర్‌గా నికోల‌స్ రికార్డుల‌కెక్కాడు.  పూర‌న్‌ కేవ‌లం 1198 బంతుల్లోనే  ఈ రేర్ ఫీట్‌ను అందుకున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కు ఈ రికార్డు భార‌త మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్(1211) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో సెహ్వాగ్ రికార్డును ఈ కరేబియ‌న్ వీరుడు బ్రేక్ చేశాడు. ఈ అరుదైన రికార్డు సాధించిన జాబితాతో పూరన్ సహచరుడు రస్సెల్‌(1120) అగ్రస్ధానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆట‌గాళ్లు
1120 - ఆండ్రీ రస్సెల్
1198 - నికోలస్ పూరన్
1211 - వీరేంద్ర సెహ్వాగ్
1251 - క్రిస్ గేల్
1306 - రిషబ్ పంత్
1309 - గ్లెన్ మాక్స్‌వెల్‌

ఉత్కంఠ పోరులో ల‌క్నో గెలుపు..
ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఆఖ‌రి వ‌రకు జ‌రిగిన ఉత్కంఠ‌పోరులో 4 ప‌రుగుల తేడాతో ల‌క్నో విజ‌యం సాధించింది. 239  ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 234  ప‌రుగులు చేయ‌గ‌ల్గింది. 

కేకేఆర్ బ్యాట‌ర్ల‌లో అజింక్య ర‌హానే(61) టాప్ స్కోర‌ర్‌గా నిల‌వ‌గా.. రింకూ సింగ్‌(38), వెంక‌టేశ్ అయ్య‌ర్‌(45), సునీల్ న‌రైన్‌(30) పోరాడారు. ల‌క్నో బౌల‌ర్ల‌లో ఆకాష్ దీప్, శార్ధూల్ ఠాకూర్ త‌లా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. అవేష్ ఖాన్‌,బిష్ణోయ్‌, దిగ్వేష్ త‌లా వికెట్ సాధించారు.

అంత‌కుముందు బ్యాటింగ్‌కు చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ల‌క్నో బ్యాట‌ర్ల‌లో పూర‌న్‌(87)తో పాటు మార్ష్‌ (48 బంతుల్లో 81; 6 ఫోర్లు, 5 సిక్సర్లు),మార్‌క్ర‌మ్‌(28 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్బ‌తమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు.
చ‌ద‌వండి: Rohit Sharma: రోహిత్ శ‌ర్మకు అరుదైన గౌర‌వం..!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)