రిటైర్మెంట్‌ ప్రకటించిన మరుసటి రోజే పూరన్‌కు బంపరాఫర్‌.. కెప్టెన్‌గా ఎంపిక

Published on Wed, 06/11/2025 - 12:15

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన మరుసటి రోజే విండీస్‌ విధ్వంసకర యోధుడు నికోలస్‌ పూరన్‌కు బంపర్‌ ఆఫర్‌ వచ్చింది. త్వరలో ప్రారంభం కానున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2025 సీజన్‌ కోసం ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్‌ పూరన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు సోషల్‌మీడియాలో వేదికగా ఓ ప్రకటన విడుదల చేసింది.

మా హీరో, మా కెప్టెన్, 29 ఏళ్ల పాకెట్ డైనమైట్, MINY సూపర్ స్టార్ - నికోలస్ పూరన్ కాగ్నిజెంట్ మేజర్ లీగ్ క్రికెట్ 2025 సీజన్‌కు ముందు MI న్యూయార్క్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ ఎడమచేతి వాటం వికెట్ కీపర్ బ్యాటర్ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్లలో ఒకరు. ప్రస్తుతం అతని శక్తుల అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. అతని నాయకత్వంలో MINYని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడు అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఎంఎల్‌సీలో రెండు సీజన్లలో కీరన్‌ పోలార్డ్‌ ఎంఐ న్యూయార్క్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ప్రస్తుత సీజన్‌కు పోలార్డ్‌ అందుబాటులో ఉండే అంశంపై క్లారిటీ లేదు. దీంతో యాజమాన్యం పూరన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. పోలీ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ కోచ్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

ఎంఎల్‌సీ 2025 రేపటి నుంచి (జూన్‌ 12) నుంచి జులై 13 వరకు యూఎస్‌ఏలో జరుగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. లాస్‌ ఏంజెలెస్‌ నైట్‌రైడర్స్‌కు సునీల్‌ నరైన్‌, ఎంఐ న్యూయార్క్‌కు పూరన్‌, శాన్‌ ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌కు కోరె ఆండర్సన్‌, సియాటిల్‌ ఒర్కాస్‌కు హెన్రిచ్‌ క్లాసెన్‌, టెక్సస్‌ సూపర్‌ కింగ్స్‌కు డుప్లెసిస్‌, వాషింగ్టన్‌ ఫ్రీడంకు మ్యాక్స్‌వెల్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు.

కాగా, ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ సభ్యుడిగా ఉన్న పూరన్‌ ఎంఎల్‌సీలో ముంబై ఇండియన్స్‌ సిస్టర్‌ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌లో ఆరంభ సీజన్‌ నుంచి (2023) పాల్గొంటున్నాడు. ఎంఎల్‌సీ ఆరంభ ఎడిషన్‌లో పూరన్‌ ఎంఐ న్యూయార్క్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకపాత్ర పోషించాడు. 

ఆ సీజన్‌లో పూరన్‌ 8 మ్యాచ్‌ల్లో 167.24 స్ట్రయిక్‌రేట్‌తో 388 పరుగులు చేశాడు. ఫైనల్లో పూరన్‌ విధ్వంసకర శతకం (55 బంతుల్లో 137 నాటౌట్‌; 10 ఫోర్లు, 13 సిక్సర్లు) చేసి ఒంటిచేత్తో తన జట్టును విజయతీరాలకు చేర్చి టైటిల్‌ను అందించాడు.

2025 ఎంఎల్‌సీ కోసం ఎంఐ న్యూయార్క్‌ జట్టు..
పూరన్‌ (కెప్టెన్‌), పోలార్డ్‌, ఎహసాన్‌ ఆదిల్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, నోష్తుశ్‌ కెంజిగే, రషీద్‌ ఖాన్‌, మోనాంక్‌ పటేల్‌, సన్నీ పటేల్‌, హీత్‌ రిచర్డ్స్‌, రుషిల్‌ ఉగార్కర్‌, అగ్ని చోప్రా, తజిందర్‌ సింగ్‌, కన్వర్జిత్‌ సింగ్‌, శరద్‌ లాంబా, జార్జ్‌ లిండే, క్వింటన్‌ డికాక్‌, మైఖేల్‌ బ్రేస్‌వెల్‌, నవీన్‌ ఉల్‌ హాక్‌, అజ్మతుల్లా ఒమర్‌జాయ్‌

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)