Breaking News

మిల్నేకు పిలుపు

Published on Sun, 06/29/2025 - 03:48

వెల్లింగ్టన్‌: జాతీయ కాంట్రాక్ట్‌ తీసుకునేందుకు నిరాకరించిన న్యూజిలాండ్‌ సీనియర్‌ ఓపెనర్‌ డెవాన్‌ కాన్వేను... ముక్కోణపు టి20 టోర్నమెంట్‌కు ఎంపిక చేయలేదు. వచ్చేనెలలో దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో కలిసి న్యూజిలాండ్‌ జట్టు టి20 టోర్నమెంట్‌ ఆడనుంది. ఈ ముక్కోణపు పోటీకి జింబాబ్వే ఆతిథ్యమిస్తుండగా... దీని కోసం న్యూజిలాండ్‌ బోర్డు శుక్రవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఇందులో సీనియర్‌ ఓపెనర్‌ కాన్వేకు చోటు దక్కలేదు. ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆడేందుకు వీలుగా అతడు జాతీయ కాంట్రాక్ట్‌ను వదులుకోగా... ఈ టోర్నీకి అందుబాటులో ఉండనని మాజీ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ప్రకటించాడు. 

అతడు ప్రస్తుతం ఇంగ్లండ్‌ కౌంటీ చాంపియన్‌షిప్‌లో మిడిలెసెక్స్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 23 ఏళ్ల బెవాన్‌ జాకబ్‌కు మరో అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌కు కూడా అతడిని ఎంపిక చేసినా... మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కలేదు. మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న ఆడమ్‌ మిల్నే, టిమ్‌ సీఫెర్ట్, ఫిన్‌ అలెన్‌లను తిరిగి జట్టులోకి వచ్చారు. అలెన్‌ ఇటీవల ఈ లీగ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 19 సిక్స్‌లు కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 

గత ఏడాది ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20లో చివరిసారి మిల్నే న్యూజిలాండ్‌ తరఫున బరిలోకి దిగాడు. ఈ జట్టుకు మిచెల్‌ సాంట్నర్‌ సారథ్యం వహించనున్నాడు. ‘ముక్కోణపు టోర్నీ కోసం బలమైన జట్టును ఎంపిక చేశాం. ఐపీఎల్‌ కారణంగా పాకిస్తాన్‌తో జరిగిన సిరీస్‌కు అందుబాటులో లేని పలువురు ఆటగాళ్లు ఈ టోర్నీ బరిలోకి దిగనున్నారు. వారంతా మెరుగైన ప్రదర్శన కనబరుస్తారనే నమ్మకముంది’ అని న్యూజిలాండ్‌ హెడ్‌ కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ అన్నాడు. వచ్చే నెల 14–26 వరకు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో మూడు జట్ల మధ్య ఈ టోర్నీ జరగనుంది.   

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)