Breaking News

న్యూజిలాండ్‌కు ఆధిక్యం

Published on Fri, 12/12/2025 - 01:38

వెల్లింగ్టన్‌: సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 24/0తో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ చివరకు 74.4 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటైంది. మిచెల్‌ హే (93 బంతుల్లో 61; 9 ఫోర్లు, 1 సిక్స్‌), డెవాన్‌ కాన్వే (108 బంతుల్లో 60; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. కేన్‌ విలియమ్సన్‌ (37; 7 ఫోర్లు), డారిల్‌ మిచెల్‌ (25; 1 ఫోర్, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించారు. 

విండీస్‌ బౌలర్ల ధాటికి కివీస్‌ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోగా... మిచెల్‌ హే చివరి వరకు పోరాడి జట్టుకు 73 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం అందించాడు. ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడ్డ బ్లెయిర్‌ టిక్నెర్‌ బ్యాటింగ్‌కు రాలేదు. కరీబియన్‌ బౌలర్లలో అండర్సన్‌ ఫిలిప్‌ 3, రోచ్‌ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. 

జాన్‌ క్యాంప్‌బెల్‌ (14), అండర్సన్‌ ఫిలిప్‌ (0) అవుట్‌ కాగా... బ్రాండన్‌ కింగ్‌ (15 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), కవెమ్‌ హడ్జ్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న విండీస్‌ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంకా 41 పరుగులు వెనుకబడి ఉంది. కివీస్‌ బౌలర్లలో జాకబ్‌ డఫీ, మిచెల్‌ రే చెరో వికెట్‌ పడగొట్టారు.  
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)