బదులు తీర్చుకున్న న్యూజిలాండ్‌.. ఉత్కంఠపోరులో పాకిస్తాన్‌పై విజయం

Published on Tue, 04/18/2023 - 13:35

లాహొర్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో 4 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో కివీస్‌ తొలి గెలుపు నమోదు చేసింది. 164 పరుగుల లక్క్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఆఖరిలో ఇఫ్తికర్‌ ఆహ్మద్‌(23 బంతుల్లో 60) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడినప్పటికీ.. పాకిస్తాన్‌ విజయం సాధించలేకపోయింది.

చివరి ఓవర్‌లో పాక్‌ విజయానికి 15 పరుగులు అవసరమవ్వగా.. కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌  బంతిని నీషమ్‌ చేతికి ఇచ్చాడు. తొలి బంతిని ఇఫ్తికర్‌ ఆహ్మద్‌ సిక్సర్‌గా మలచగా.. రెండో బంతికి ఎటువంటి రన్స్‌ రాలేదు. మూడో బంతికి ఇఫ్తికర్‌ ఫోర్‌ బాదాడు. అయితే దురదృష్టవశాత్తూ నాలుగో బంతికి  ఇఫ్తికర్‌ ఔటయ్యాడు. దీంతో పాకిస్తాన్‌ ఓటమి ఖారారైంది.

న్యూజిలాండ్‌ బౌలర్లలో నీషమ్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. మిల్నే,రవీంద్ర తలా రెండు వికెట్లు సాధించారు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కివీస్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌(64) పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. పాక్‌ బౌలర్లలో హారీస్‌ రౌఫ్‌, అఫ్రిది తలా రెండు వికెట్లు సాధించగా.. షాదాబ్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ పడగొట్టాడు.
చదవండి: IPL 2023: తెలుగులో మాట్లాడిన రోహిత్‌ శర్మ.. పదండి ఉప్పల్‌కి అంటూ! వీడియో వైరల్‌

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)