Breaking News

సౌతాఫ్రికాతో సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. రచిన్‌ రీఎంట్రీ..?

Published on Fri, 01/26/2024 - 10:15

సౌతాఫ్రికా స్వదేశంలో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం​ న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ (జనవరి 26) ప్రకటించారు. ఈ సిరీస్‌లో టిమ్‌ సౌథీ న్యూజిలాండ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రైట్‌ ఆర్మ్‌ మీడియం పేసర్‌ విల్‌ ఓ రూర్కీకు తొలి సారి టెస్ట్‌ జట్టులో అవకాశం లభించింది. వరల్డ్‌కప్‌ హీరో రచిన్‌ రవీంద్ర ఈ సిరీస్‌తో టెస్ట్‌ల్లోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. అయితే రచిన్‌ వన్డేల్లోలా ఓపెనర్‌గా కాకుండా మిడిలార్డర్‌లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన జట్టులో సీనియర్‌ ప్లేయర్‌ హెన్రీ నికోల్స్‌కు అవకాశం లభించలేదు కాదు కాబట్టి రచిన్‌కు దాదాపు లైన్‌ క్లియర్‌ అయినట్లే. 

2021 భారత​ పర్యటనలో టెస్ట్‌ అరంగేట్రం చేసిన రచిన్‌.. ఆ పర్యటనలో రెండు టెస్ట్‌లు, ఆతర్వాత 2022లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో మాత్రమే ఆడాడు. ఆతర్వాత రచిన్‌కు టెస్ట్‌ జట్టులో అవకాశం దొరకలేదు. తిరిగి ఇన్నాళ్లకు రచిన్‌కు టెస్ట్‌ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. వన్డే వరల్డ్‌కప్‌ 2023 అద్భుత ప్రదర్శనకు గానూ రచిన్‌ గతేడాది ఐసీసీ ఎమర్జింగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ మౌంట్‌ మాంగనూయ్‌ వేదికగా ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు.. రెండో మ్యాచ్‌ హ్యామిల్టన్‌ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 17 తేదీల మధ్యలో జరుగుతుంది.

సౌతాఫ్రికాతో సిరీస్‌కు న్యూజిలాండ్‌ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్, డెవాన్ కాన్వే, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ (రెండో టెస్టుకు మాత్రమే), గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్ , విల్ యంగ్

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)