Breaking News

IND Vs NZ 1st Test: చ‌రిత్ర సృష్టించిన న్యూజిలాండ్‌.. 36 ఏళ్ల నిరీక్షణకు తెర

Published on Sun, 10/20/2024 - 13:28

న్యూజిలాండ్ క్రికెట్ జ‌ట్టు చ‌రిత్ర సృష్టించింది. 36 ఏళ్ల తర్వాత భారత గడ్డపై తొలి టెస్టు విజయాన్ని కివీస్ నమోదు చేసింది.  బెంగళూరు వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న న్యూజిలాండ్ తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది.

కివీస్ చివ‌ర‌గా 1988లో వాంఖ‌డే వేదిక‌గా జ‌రిగిన భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో గెలుపొందింది. మళ్లీ ఇప్పుడు చారిత్రత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తంగా భారత్‌లో కివీస్‌కు ఇది కేవలం మూడు టెస్టు విజయం మాత్రమే.

కివీస్ ఆల్‌రౌండ్ షో..
ఇక ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ అద్బుతమైన ప్రదర్శన కబనరిచింది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ దుమ్ములేపింది. 107 ప‌రుగుల స్వల్ప లక్ష్యాన్ని బ్లాక్ క్యాప్స్ కేవలం రెండు వికెట్లు మాత్ర‌మే కోల్పోయి చేధించింది. కివీ బ్యాట‌ర్లు విల్ యంగ్‌(48), ర‌చిన్ రవీంద్ర (39) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ బౌలర్లు భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 46 పరుగులకే కుప్పకూల్చారు.

 కివీ బౌలర్లలో మాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా, యువ పేసర్ ఓ రూర్క్  4 వికెట్లతో మెరిశాడు. అయితే సెకెండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం భారత బ్యాటర్లు అద్బుతమైన కమ్ బ్యాక్ ఇచ్చారు. సర్ఫరాజ్‌ ఖాన్‌(150) సెంచరీతో చెలరేగగా, పంత్‌(99) అదరగొట్టాడు. దీంతో టీమిండియా 462 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

అయితే 356 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ ప్రత్యర్ధి ముందు కేవలం​ 107 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. కివీస్‌ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 402 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో రచిన్‌ రవీంద్ర(134) సెంచరీతో మెరిశాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ రవీంద్ర(39 నాటౌట్‌) అదరగొట్టాడు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)