Breaking News

ఆసీస్‌ను గెలిపించిన టిమ్‌ డేవిడ్‌

Published on Thu, 02/22/2024 - 04:14

వెల్లింగ్టన్‌: ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన తొలి టి20 మ్యాచ్‌లో టిమ్‌ డేవిడ్‌ (10 బంతుల్లో 31 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపులు ఆ్రస్టేలియాను గెలిపించాయి. న్యూజిలాండ్‌తో జరిగిన ఈ పోరులో ఆ్రస్టేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా కివీస్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 215 పరుగుల భారీస్కోరు చేసింది. రచిన్‌ రవీంద్ర (35 బంతుల్లో 68; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు), కాన్వే (46 బంతుల్లో 63; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు.

అనంతరం ఆసీస్‌ ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌), డేవిడ్‌ వార్నర్‌ (20 బంతుల్లో 32; 1 ఫోర్, 3 సిక్స్‌లు) తక్కువే చేసినా... ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మిచెల్‌ మార్ష్ (44 బంతుల్లో 72 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెపె్టన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 17వ ఓవర్‌ ఆఖరి బంతికి హిట్టర్‌ టిమ్‌ డేవిడ్‌ క్రీజులోకి వచ్చాడు. అప్పుడు ఆసీస్‌ గెలిచేందుకు 19 బంతుల్లో 44 పరుగులు కావాలి. కాసేపటికే అది కాస్తా 9 బంతుల్లో 32 పరుగుల సమీకరణం కష్టంగా మారింది.

ఈ దశలో మిల్నే వేసిన 19వ ఓవర్‌ ఆఖరి మూడు బంతుల్ని డేవిడ్‌ 4, 6, 6లుగా బాదేశాడు. దాంతో చివరి ఓవర్లో ఆసీస్‌ విజయానికి 6 బంతుల్లో 16 పరుగులు అవసరమయ్యాయి. చివరి ఓవర్‌ వేసిన సౌతీ వైడ్‌ సహా 3 బంతుల్లో 4 పరుగులే ఇచ్చాడు. ఇక మిగిలిన 3 బంతుల్లో 12 పరుగులు కావాల్సి ఉండగా... డేవిడ్‌ 6, 2, 4లతో ఆసీస్‌ జట్టును గెలిపించాడు. ఈ గెలుపుతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆ్రస్టేలియా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో టి20 మ్యాచ్‌ శుక్రవారం ఆక్లాండ్‌లో జరుగుతుంది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)