Breaking News

ఉత్కంఠ పోరు.. విండీస్‌పై న్యూజిలాండ్‌ గెలుపు

Published on Mon, 11/17/2025 - 09:52

వెస్టిండీస్‌తో మూడు వ‌న్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. ఆదివారం క్రైస్ట్ చ‌ర్చ్ వేదిక‌గా జ‌రిగిన తొలి   వ‌న్డేలో విండీస్‌పై 7 పరుగుల తేడాతో కివీస్ విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో  7 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది.

బ్లాక్ క్యాప్స్ బ్యాట‌ర్ల‌లో  డారిల్‌ మిచెల్‌ (118 బంతుల్లో 119; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) అద్భుత సెంచ‌రీతో చెల‌రేగ‌గా.. డెవాన్‌ కాన్వే (58 బంతుల్లో 49; 7 ఫోర్లు, 1 సిక్స్‌)  ఆర్ధ శ‌త‌కంతో రాణించాడు. టాపార్డ‌ర్ బ్యాట‌ర్లు రచిన్‌ రవీంద్ర (4), విల్‌ యంగ్‌ (0) విఫ‌ల‌మ‌య్యారు. విండీస్ బౌల‌ర్ల‌లో జేడెన్ సీల్స్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. మాథ్యూ ఫోర్డ్ రెండు, గ్రీవ్స్‌, చేజ్ త‌లా వికెట్ సాధించారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 6 వికెట్లకు 262 పరుగులే చేయగలిగింది. 

షెర్ఫాన్‌ రూథర్‌ఫర్డ్‌ (61 బంతుల్లో 55; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), గ్రీవ్స్‌ (24 బంతుల్లో 38 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ షై హోప్‌ (37; 2 ఫోర్లు, 1 సిక్స్‌), కీసీ కార్టి (32; 2 ఫోర్లు), అతానెజ్‌ (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌), రొమారియో షెఫర్డ్‌ (26 నాటౌట్‌; 1 ఫోర్, 1 సిక్స్‌) సమష్టిగా రాణించడంతో గెలిచే స్థితిలో నిలిచింది. కానీ ఆఖరి 12 బంతుల్లో 32 పరుగుల సమీకరణాన్ని సాధించలేకపోయింది. చివరి రెండు ఓవర్లలో కరేబియన్‌ జట్టు 24 పరుగులు సాధించి ఓటమి పాలైంది. జేమీసన్‌ కీలక వికెట్లు పడగొట్టగా, హెన్రీ, ఫౌక్స్, సాన్‌ట్నర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.
చదవండి: IND vs SA: ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టుకు డౌటే

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)