కివీస్‌తో రెండో టీ20.. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక బొక్కబోర్లా పడ్డ శ్రీలంక

Published on Sun, 11/10/2024 - 23:11

శ్రీలంక, న్యూజిలాండ్‌ మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమంగా ముగిసింది. ఇవాళ (నవంబర్‌ 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్‌ నిర్దేశించిన 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక శ్రీలంక జట్టు బొక్కబోర్లా పడింది. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. శ్రీలంక బౌలర్లు వనిందు హసరంగ (4-1-17-4), మతీష పతిరణ (4-1-11-3), నువాన్‌ తుషార (4-0-22-2), మహీశ్‌ తీక్షణ (3.3-0-16-1) ధాటికి 19.3 ఓవర్లలో 108 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ యంగ్‌ (30), జోష్‌ క్లార్క్‌సన్‌ (24), మిచెల్‌ సాంట్నర్‌ (19) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.

అనంతరం బరిలోకి దిగిన శ్రీలంక.. 109 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేక 5 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. శ్రీలంకను తొలుత లోకీ ఫెర్గూసన్‌ (2-0-7-3) హ్యాట్రిక్‌తో దెబ్బకొట్టగా.. ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ మూడు వికెట్లు తీసి శ్రీలంక చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. 

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి జాగ్రత్తగా ఆడిన పథుమ్‌ నిస్సంకను (52) ఫిలిప్స్‌ ఆఖరి ఓవర్‌ రెండో బంతికి ఔట్‌ చేశాడు. ఆతర్వాత మూడు, ఐదు బంతులకు పతిరణ (0), తీక్షణ (14) వికెట్లు తీశాడు. లంక ఇన్నింగ్స్‌లో నిస్సంకతో పాటు భానుక రాజపక్స్‌(15), తీక్షణ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో ఫిలిప్స్‌, ఫెర్గూసన్‌ తలో 3 వికెట్లు.. బ్రేస్‌వెల్‌ 2, సాంట్నర్‌, ఫోల్క్స్‌ తలో వికెట్‌ పడగొట్టారు. ఈ సిరీస్‌లోని తొలి టీ20లో శ్రీలంక విజయం సాధించిన విషయం తెలిసిందే.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)