Breaking News

టీ20 ప్రపంచకప్‌ 2026కు న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన

Published on Wed, 01/07/2026 - 10:32

ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యుల న్యూజిలాండ్‌ జట్టును ఇవాళ (జనవరి 7) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా మిచెల్‌ సాంట్నర్‌ ఎంపికయ్యాడు. ఉపఖండపు పరిస్థితుల దృష్ట్యా న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు స్పిన్‌ హెవీ టీమ్‌ను ఎంపిక చేసింది. జట్టులో నలుగురు స్పిన్నర్లకు (సాంట్నర్‌, బ్రేస్‌వెల్‌, ఫిలిప్స్‌, రచిన్‌) అవకాశం కల్పించింది.

ఆర్సీబీ స్టార్‌ బౌలర్‌, గతేడాది లీడింగ్‌ వికెట్‌ టేకర్‌ జేకబ్‌ డఫీ తొలిసారి ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నాడు. కైల్‌ జేమీసన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌గా ఎంపికయ్యాడు. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. లాకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ పితృత్వ సెలవుల కారణంగా కొన్ని మ్యాచ్‌లు మిస్ అవుతారు. వీరిద్దరు గాయాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు.

ఈ జట్టుకు ఎంపికైన మరో ముగ్గురు (ఫిన్ అలెన్, మార్క్ చాప్‌మన్, సాంట్నర్) కూడా గాయాల నుంచి కోలుకునే క్రమంలో ఉన్నారు. కాగా, ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌, ఆఫ్ఘనిస్తాన్‌, కెనడా, సౌతాఫ్రికా, యూఏఈ గ్రూప్‌-డిలో ఉన్నాయి. న్యూజిలాండ్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 8న చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో ఆడుతుంది.

దీనికి ముందు న్యూజిలాండ్‌ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌ల్లో భాగంగా జనవరి 11 నుంచి మూడు వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే వడోదరలో.. రెండో వన్డే రాజ్‌కోట్‌లో (జనవరి 14), మూడో వన్డే ఇండోర్‌లో (జనవరి 18) జరుగనున్నాయి. 

అనంతరం జనవరి 21 నుంచి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ప్రారంభమవుతుంది. జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో నాగ్‌పూర్‌, రాయ్‌పూర్‌, గౌహతి, వైజాగ్‌, తిరువనంతపురం వేదికలుగా టీ20లు​ జరుగనున్నాయి. ఈ సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో నలుగురిని మార్చి ప్రపంచకప్‌ జట్టును ఎంపిక చేసింది.

టీ20 ప్రపంచకప్‌కు న్యూజిలాండ్‌ జట్టు
- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్)  
- ఫిన్ అలెన్  
- మైఖేల్ బ్రేస్‌వెల్  
- మార్క్ చాప్‌మన్‌  
- డెవాన్ కాన్వే  
- జేకబ్ డఫీ  
- లాకీ ఫెర్గుసన్  
- మ్యాట్ హెన్రీ  
- డారిల్ మిచెల్  
- ఆడమ్ మిల్నే  
- జేమ్స్ నీషమ్  
- గ్లెన్ ఫిలిప్స్  
- చిన్ రవీంద్ర  
- టిమ్ సీఫర్ట్  
- ఇష్ సోధీ  

ట్రావెలింగ్ రిజర్వ్: కైల్ జేమిసన్  

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)