Breaking News

ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌.. న్యూజిలాండ్‌ జట్టు ఇదే! స్టార్‌ బౌలర్‌ వచ్చేశాడు

Published on Fri, 02/03/2023 - 15:51

స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు 14 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. ఈ జట్టుకు టిమ్‌ సౌథీ సారథ్యం వహించనున్నాడు. అదే విధంగా గత ఏడాది నుంచి గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్‌ పేసర్‌ కైల్ జేమీసన్ మళ్లీ రీ ఎం‍ట్రీ ఇచ్చాడు.

ఇప్పటివరకు 16 టెస్టులు ఆడిన జేమీసన్ 72 వికెట్లు సాధించాడు. మరోవైపు కివీస్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉన్నాడు. అదే విధంగా ఈ జట్టులో స్పిన్నర్‌ ఆజాజ్‌ పటేల్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ గ్లెన్‌ ఫిలిప్స్‌కు చోటు దక్క లేదు. 

ఇక భారత్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన ఆల్‌రౌండర్‌ మైఖేల్‌ బ్రేస్‌వేల్‌కు టెస్టు జట్టులో చోటు దక్కింది. ఇక ఈ హోం సిరీస్‌లో భాగంగా కివీస్‌ ఇంగ్లండ్‌తో రెండు టెస్టులు ఆడనుంది. అయితే ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌(పింక్‌బాల్‌ టెస్టు)గా జరగనుంది. ఈ మ్యాచ్‌ తౌరంగ వేదికగా ఫిబ‍్రవరి 16 నుంచి 20 వరకు జరగనుంది.

ఇంగ్లండ్‌తో టెస్టులకు న్యూజిలాండ్‌ జట్టు: టిమ్ సౌథీ (కెప్టెన్‌), మైఖేల్ బ్రేస్‌వెల్, టామ్ బ్లండెల్ (వికెట్‌ కీపర్‌), డెవాన్ కాన్వే, మాట్ హెన్రీ, కైల్ జామీసన్, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్, నీల్ వాగ్నర్, కేన్ విలియమ్సన్‌, విల్ యంగ్.
చదవండి: IND Vs AUS: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌.. జిమ్‌లో కోహ్లి కసరత్తులు! వీడియో వైరల్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)