Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ కోసం న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన..

Published on Tue, 09/10/2024 - 10:09

మహిళల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024, ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లకు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ఎంపికైంది. అదే విధంగా ఈ జ‌ట్టులో  సీనియ‌ర్ క్రికెట‌ర్  సుజీ బేట్స్‌కు కూడా చోటు ద‌క్కింది. 

గ‌త కొంత కాలంగా గాయం కార‌ణంగా దూరంగా ఉంటున్న ఎక్స్‌ప్రెస్ పేస‌ర్ రొస్మేరీ మైర్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చింది. ఆమె రాక‌తో వైట్ ఫెర్న్‌(న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు) బౌలింగ్ విభాగం మ‌రింత బ‌లంగా మారింది. 

లీ కాస్పెరెక్, మెలీ కెర్, ఫ్రాన్ జోనాస్, ఈడెన్ కార్సన్ వంటి స్పిన్న‌ర్ల‌కు సైతం వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటు ల‌భించింది. ఇక ఈ మెగా టోర్నీ ఆక్టోబ‌ర్ 3 నుంచి యూఎఈ వేదిక‌గా ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ త‌మ తొలి మ్యాచ్‌లో ఆక్టోబ‌ర్ 4న భార‌త్‌తో త‌ల‌ప‌డ‌నుంది.

కాగా టీ20 వరల్డ్‌కప్‌ సన్నాహాకాల్లో భాగంగా న్యూజిలాండ్‌.. ఆసీస్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గోనుంది. ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 19 నుంచి 24 మధ్య జరగనుంది. ఆ తర్వాత పొట్టి ప్రపంచకప్‌ కసం యూఏఈకు వైట్ ఫెర్న్స్‌ బయలదేరనున్నారు. కాగా టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత సోఫీ డివైన్‌ కెప్టెన్సీకి విడ్కోలు పలకనుంది.

న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్‌), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, ఇజ్జీ గేజ్ (వికెట్‌ కీపర్‌), మాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, ఫ్రాన్ జోనాస్, లీ కాస్పెరెక్, జెస్ కెర్, మెలీ కెర్, రోజ్మేరీ మెయిర్, మోలీ పెన్ఫోల్డ్, జార్జియా ప్లిమ్మర్, హన్నా రోవ్, లీ తహుహు
చదవండి: #Joe Root: చ‌రిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్ రికార్డు బ్రేక్‌
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)