న్యూజిలాండ్‌ జట్టు ప్రకటన.. కేన్‌ మామ వచ్చేశాడు! స్టార్‌ ప్లేయర్‌కు నో ఛాన్స్‌

Published on Fri, 11/15/2024 - 11:14

స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును న్యూజిలాండ్ క్రికెట్ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు టామ్ లాథ‌మ్ సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. ఇక‌ స్టార్ బ్యాట‌ర్ కేన్ విలియ‌మ్స‌న్ తిరిగి జ‌ట్టులోకి వ‌చ్చాడు.

గ‌జ్జ గాయం కారణంగా ఈ కివీ స్టార్‌ క్రికెటర్ భారత్ టెస్టులకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు గాయం నుంచి విలియ‌మ్స‌న్ పూర్తిగా కోలుకోవ‌డంతో ఇంగ్లీష్ జ‌ట్టుతో సిరీస్‌కు కివీస్ సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు.

అదేవిధంగా బౌలింగ్ ఆల్‌రౌండ‌ర్ నాథన్ స్మిత్‌కు తొలిసారి కివీస్ టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత‌డికి అద్బుత‌మైన ట్రాక్ రికార్డు ఉంది. స్మిత్ 114 ఫస్ట్-క్లాస్ వికెట్లతో పాటు 1919 ప‌రుగులు కూడా సాధించాడు. ఈ క్ర‌మంలోనే అత‌డికి సెల‌క్ట‌ర్లు పిలుపునిచ్చారు.

అజాజ్ ప‌టేల్‌, సోధి దూరం!
ఇక ఈ సిరీస్‌కు న్యూజిలాండ్ స్పిన్ ద్వయం అజాజ్ పటేల్,  ఇష్ సోధిని సెల‌క్ట‌ర్లు ఎంపిక చేయ‌లేదు. న్యూజిలాండ్‌లోని పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయి. దీంతో అక్కడి పరిస్థితులకు తగ్గట్టు ఐదుగురు ఫాస్ట్ బౌల‌ర్ల‌ను సెల‌క్ట‌ర్లు ఎంపిక చేశారు.

జాక‌బ్ డ‌ఫీకి కూడా ఈ జ‌ట్టులో చోటు ద‌క్కింది. నవంబ‌ర్ 28 నుంచి క్రైస్ట్ చ‌ర్చ్ వేదిక‌గా ఈ మూడు మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కానుంది. కాగా భార‌త్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌ను న్యూజిలాండ్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.
ఇంగ్లండ్ టెస్టులకు న్యూజిలాండ్ జట్టు
టామ్ లాథమ్ (కెప్టెన్‌), టామ్ బ్లండెల్ (వికెట్ కీప‌ర్‌), డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ (అన్ క్యాప్డ్), మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, విల్ ఓ'రూర్క్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్ , నాథన్ స్మిత్, టిమ్ సౌతీ, కేన్ విలియమ్సన్, విల్ యంగ్
చదవండి: IND vs AUS: ఆసీస్‌తో టెస్టు సిరీస్‌.. టీమిండియాకు మరో భారీ షాక్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)