Breaking News

బెంగళూరులో కొత్త ఎన్‌సీఏ.. ప్రారంభం ఎప్పుడంటే?

Published on Fri, 09/06/2024 - 10:34

బెంగళూరు: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో కొత్తగా నిర్మితమైన జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. బెంగళూరు నగర శివారులో సువిశాలమైన ప్రాంగణంలో అత్యున్నత సదుపాయాలతో నిర్మించిన ఎన్‌సీఏను ఈనెల 29వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నారు.

అదే రోజున బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) కూడా జరగనుంది. ఈ మీటింగ్‌ అజెండాలో కార్యదర్శి ఎన్నిక అంశం లేదని బోర్డు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కార్యదర్శి జై షా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవడంతో బీసీసీఐ కార్యదర్శి పదవి ఖాళీ కానుంది. ప్రస్తుత చైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లే పదవీ కాలం నవంబర్‌ నెలాఖరుదాకా ఉంది. 

డిసెంబర్‌ 1 తర్వాతే జై షా ఐసీసీ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టాల్సి ఉండటంతో అప్పటిదాకా బోర్డు కార్యదర్శిగా ఆయన కొనసాగుతారు. దీంతో ఎన్నికపై ఇప్పుడప్పుడే నియామక ప్రక్రియ చేపట్టే అవకాశమే లేదని బోర్డు వర్గాలు తెలిపాయి. ఎప్పట్లాగే బోర్డు వ్యవహారాలు, ఆదాయ–వ్యయాలు, వార్షిక బడ్జెట్‌పై చర్చ జరుగుతుందని బోర్డు అధికారులు చెప్పారు.    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)