Breaking News

W T20 WC 2024: కొత్త చాంపియన్‌ న్యూజిలాండ్‌

Published on Mon, 10/21/2024 - 03:00

ఒక జట్టు తలరాత మారలేదు. పురుషులు, మహిళల జట్టేదైనా కావొచ్చు కానీ... దక్షిణాఫ్రికా ఐసీసీ ప్రపంచకప్‌ భాగ్యానికి మాత్రం నోచుకోలేదు. మరో‘సారీ’ చోకర్స్‌గానే మిగిలారు. మరో జట్టు కొత్త చరిత్ర లిఖించింది. ఇన్నేళ్లయినా న్యూజిలాండ్‌ పురుషుల జట్టు సాధించలేకపోయిన వరల్డ్‌కప్‌ (వన్డే, టి20) టైటిల్స్‌ను న్యూజిలాండ్‌ మహిళల జట్టు (2000లో వన్డే) సాధించి ఔరా అనిపించింది.   

దుబాయ్‌: దక్షిణాఫ్రికాను చూస్తే ఎవరైనా అయ్యో పాపం అనక మానరు! సరిగ్గా నాలుగు నెలల కిందట టీమిండియా చేతిలో పురుషుల జట్టు, ఇప్పుడేమో న్యూజిలాండ్‌ చేతిలో మహిళల దక్షిణాఫ్రికా టీమ్‌ ఫైనల్లో పరాజయంతో ప్రపంచకప్‌ కలను కలగానే మిగిల్చుకున్నాయి. సఫారీకిది తీరని వ్యథే! మరీ ముఖ్యంగా అమ్మాయిలకైతే గతేడాది సొంతగడ్డపై, ఇప్పుడు దుబాయ్‌లో వరుసగా రన్నరప్‌ ట్రోఫీనే దిక్కయింది. 

మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆదివారం జరిగిన టైటిల్‌ పోరులో న్యూజిలాండ్‌ కొత్త విశ్వవిజేతగా అవతరించింది. అమీతుమీలో కివీస్‌ జట్టు 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మూడో ప్రయత్నంలో టి20 ప్రపంచకప్‌ను దక్కించుకుంది. 2009, 2010లలో న్యూజిలాండ్‌ ఫైనల్లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. విజేత న్యూజిలాండ్‌ జట్టుకు 23 లక్షల 40 వేల (రూ. 19 కోట్ల 67 లక్షలు) డాలర్లు, రన్నరప్‌ దక్షిణాఫ్రికా జట్టుకు 11 లక్షల 70 వేల డాలర్లు (రూ. 9 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 

బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్‌ బ్యాటర్‌ అమెలియా కెర్‌ (43; 4 ఫోర్లు), ఓపెనర్‌ సుజీ బేట్స్‌ (32; 3 ఫోర్లు), మిడిలార్డర్‌లో బ్రూక్‌ హ్యాలిడే (28 బంతుల్లో 38; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ప్రత్యర్థి బౌలర్లలో ఎమ్‌లాబా 2 వికెట్లు తీయగా, అయబొంగ, ట్రియాన్, డి క్లెర్క్‌ తలా ఒక వికెట్‌ తీశారు. 

అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 126 పరుగులే చేసి ఓడిపోయింది. ఓపెనర్లు కెపె్టన్‌ లౌరా వోల్‌వార్ట్‌ (33; 5 ఫోర్లు), తజ్మిన్‌ బ్రిట్స్‌ (17; 1 ఫోర్‌) 6.5 ఓవర్లలో 51 పరుగులు చేసి శుభారంభమిచ్చారు. ఇక మిగిలిన 13.1 ఓవర్లలో 108 పరుగులు చేస్తే కప్‌ గెలిచేసేది. 

కానీ అదే స్కోరుపై బ్రిట్స్, కాసేపటికి లౌరా అవుట్‌ కావడంతోనే అంతా మారిపోయింది. తర్వాత వచ్చిన అనెకె (9), మరిజాన్‌ (8), డి క్లెర్క్‌ (6), ట్రియాన్‌ (14), సునె లుస్‌ (8), డెర్క్‌సెన్‌ (10) కివీ బౌలర్ల ధాటికి బెంబేలెత్తారు. రోజ్‌మేరీ, అమెలియా కెర్‌ చెరో 3 వికెట్లు తీశారు. కెర్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్, సిరీస్‌’ అవార్డులు దక్కాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)