Breaking News

ఏంటి హార్దిక్‌.. ఎంత కెప్టెన్‌ అయితే? మరీ చెత్త బ్యాటింగ్‌!

Published on Fri, 04/14/2023 - 07:40

ఐపీఎల్‌-2023లో గుజరాత్‌ టైటాన్స్‌ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గుజరాత్‌ విజయం సాధించింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్‌ బ్యాటర్లలో శుబ్‌మన్‌ గిల్‌(67) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు.

అతడితో పాటు తెవాటియా(2 బంతుల్లో5) కీలక సమయంలో ఫోర్‌ బాది గుజరాత్‌కు విజయాన్ని అందించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ 8 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేసింది. పంజాబ్‌ బ్యాటర్లలో షార్ట్‌ 36 పరుగులతో రాణిం‍చాడు. గుజరాత్‌ బౌలర్లలో మొహిత్‌ శర్మ రెండు వికెట్లు, షమీ, లిటల్‌, జోషఫ్‌,రషీద్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.

వరుసగా విఫలమవుతున్న హార్దిక్‌
ఇక గుజరాత్‌ టైటాన్స్‌ విజయాలు సాధిస్తున్నప్పటికీ.. ఆజట్టు కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య మాత్రం తీవ్ర నిరాశపరుస్తున్నాడు. గతేడాది సీజన్‌లో అద్భుతంగా రాణించిన హార్దిక్‌.. ఈ సీజన్‌లో మాత్రం బ్యాటింగ్‌, బౌలింగ్‌లో దారుణంగా విఫలమవుతున్నాడు. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పాండ్య.. 11 బంతుల్లో  కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు.

ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన అతడు 21 పరుగులు మాత్రమే చేశాడు. ఇక దారుణ ప్రదర్శన కనబరుస్తున్న హార్దిక్‌ను నెటిజన్లు దారుణం‍గా ట్రోలు చేస్తున్నారు. అదృష్టం బాగుంది కాబట్టి గెలుస్తున్నావు.. నీ చెత్త బ్యాటింగ్‌తో కాదు అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మరి కొంత మంది మరి కొంత మంది కెప్టెన్‌గా ఇదేనా నీ ఆట? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
చదవండిMohit Sharma: మూడేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చిన ధోని నమ్మిన బౌలర్‌

Videos

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

లక్ష్మణ్ తో BCCI కీలక మీటింగ్ టెన్షన్ లో గంభీర్, అగార్కర్

LIC కొత్త పాలసీ.. బెనిఫిట్స్ తెలిస్తే ఎగిరి గంతేస్తారు

KA పాల్ బంపర్ ఆఫర్

Photos

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)