Breaking News

ఇదేమి అంపైరింగ్‌రా బాబు.. కళ్లు కన్పించడం లేదా? వీడియో వైరల్‌

Published on Thu, 02/22/2024 - 08:39

దంబుల్లా వేదికగా అఫ్గానిస్తాన్‌- శ్రీలంక మధ్య మూడో టీ20 అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. ఆఖరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంకపై 3 పరుగుల తేడాతో అఫ్గానిస్తాన్‌ విజయం సాధించింది.

ఆఖరి ఓవర్‌లో లంక విజయానికి 19 పరుగుల అవసరమ్వగా.. 16 పరుగుల మాత్రమే చేసి ఓటమి పాలైంది. 210 పరుగుల భారీ లక్ష్యంతో దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లంక బ్యాటర్‌ కమిందు మెండిస్(65 నాటౌట్‌) అద్భుతమైన పోరాటం కనబరిచినప్పటికి జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు.

చెత్త అంపైరింగ్‌..
అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్‌ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. శ్రీలంక ఇన్నింగ్స్‌ కీలకమైన ఆఖరి ఓవర్‌లో అఫ్గాన్‌ పేసర్‌ వఫాదర్ మొమాండ్.. మెండిస్‌కు ఫుల్‌ టాస్‌గా సంధించాడు. అయితే ఆ బంతి మెండిస్‌ నడుముపై నుంచి వెళ్లింది. దీంతో హైట్‌ నో బాల్‌ కోసం మెండిస్‌ అప్పీల్‌ చేశాడు. కానీ స్క్వేర్ లెగ్ అంపైర్ హన్నిబాల్ మాత్రం అది ఫెయిర్‌ డెలివరీ అంటూ చెప్పుకొచ్చాడు.

కనీసం థర్డ్‌ అంపైర్‌ కైనా రిఫర్‌ చేయక పోవడం గమనార్హం. ఈ క్రమంలో మెండిస్‌ డీఆర్‌ఎస్‌ కావాలని పట్టుబట్టాడు. అయితే రూల్స్‌ ప్రకారం నో బాల్‌ విషయంలో డీఆర్‌ఎస్‌ను పరిగణలోకి తీసుకోరు. అనంతరం రిప్లేలో క్లియర్‌గా అది హైట్‌ నోబాల్‌గా తేలింది.

ఈ క్రమంలో అంపైర్‌పై నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చెత్త అంపైరింగ్‌.. కళ్లు కన్పించడం లేదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అది నోబాల్‌గా ఇచ్చి వుంటే కచ్చితంగా శ్రీలంక గెలిచి ఉండేదని మరి కొంత మంది అభిప్రాయపడుతున్నారు.
చదవండి: పాక్‌ బ్యాటర్‌ విధ్వంసం.. కేవలం 11 బంతుల్లోనే? వీడియో వైరల్‌

Videos

ప్రొద్దుటూరులో హై టెన్షన్.. రాచమల్లు, YSRCP నేతలపై లాఠీ ఛార్జ్

గుత్తిలో కౌన్సిలర్ల నామినేషన్లకు అడ్డంకులు.. శివంగిలా ఎదురెళ్లి ఇచ్చిపడేసిన నైరుతి రెడ్డి

150 కుటుంబాలు TDPకి బై బై.. విజయనగరంలో బాబుకు బిగ్ షాక్

విజయవాడ మేయర్ నాదే.. రాయన భాగ్యలక్ష్మి వైరల్ కామెంట్స్

మీ కంటే YSRCP నయం.. 40 సంవత్సరాలు TDPకి పని చేసినందుకు మీరు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా..!

లక్షకు 42 లక్షల లాభం.. రాకెట్ లా దూసుకెళ్తున్న షేర్

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)