Breaking News

యూఎస్‌ఏపై నెదర్లాండ్స్‌ భారీ విజయం

Published on Mon, 08/26/2024 - 07:04

నెదర్లాండ్స్‌ ముక్కోణపు టీ20 సిరీస్‌లో ఆతిథ్య జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో కెనడాపై విజయం​ సాధించిన నెదర్లాండ్స్‌.. తాజాగా యూఎస్‌ఏను 102 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించింది. నిన్న (ఆగస్ట్‌ 25) యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. మైఖేల్‌ లెవిట్‌ (68), స్కాట్‌ ఎడ్వర్డ్స్‌ (81 నాటౌట్‌) మెరుపు అర్ద సెంచరీలతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌లో మ్యాక్స్‌ ఓడౌడ్‌ 28, విక్రమ్‌జీత్‌ సింగ్‌ 0, జాక్‌ క్యాచెట్‌ 14, ర్యాన్‌ క్లెయిన్‌ 11 పరుగులు చేసి ఔటయ్యారు. యూఎస్‌ఏ బౌలర్లలో వాన్‌ స్కాల్‌క్విక్‌ 3, హర్మీత్‌ సింగ్‌, జునోయ్‌ డ్రైస్డేల్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన యూఎస్‌ఏ.. డచ్‌ బౌలర్లు విజృంభించడంతో 15.4 ఓవర్లలో 115 పరుగులకు చాపచుట్టేసింది. విక్రమ్‌జీత్‌ సింగ్‌ 3, కైల్‌ క్లెయిన్‌, పాల్‌ వాన్‌ మీకెరెన్‌, జాక్‌ క్యాచెట్‌ తలో 2, ఆర్యన్‌ దత్‌ ఓ వికెట్‌ పడగొట్టి యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. యూఎస్‌ఏ ఇన్నింగ్స్‌లో షయాన్‌ జహంగీర్‌ (37), ఆరోన్‌ జోన్స్‌ (34), మోనాంక్‌ పటేల్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ సిరీస్‌లో తదుపరి మ్యాచ్‌ ఇవాళ జరుగనుంది. ఈ మ్యాచ్‌లోనూ యూఎస్‌ఏ, నెదర్లాండ్స్‌ జట్లే తలపడనున్నాయి.  

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)