నేపాల్‌ బ్యాటర్ల వీరోచిత పోరాటం

Published on Wed, 02/28/2024 - 15:35

నేపాల్‌ టీ20 ట్రై సిరీస్‌లో రసవత్తర సమరం జరిగింది. నెదర్లాండ్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 28) జరిగిన మ్యాచ్‌లో నేపాల్‌ బ్యాటర్లు వీరోచితంగా పోరాడారు. మ్యాచ్‌ గెలవాలంటే 24 బంతుల్లో 57 పరుగులు చేయాల్సి ఉండగా.. దీపేంద్ర సింగ్‌ (34 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కరణ్‌ (7 బంతుల్లో 11; సిక్స్‌) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడి నేపాల్‌ను విజయానికి చేరువ చేశారు.

అయితే చివరి ఓవర్‌ మూడు, నాలుగు బంతులకు కరణ్‌, దీపేంద్ర ఔట్‌ కావడంతో నేపాల్‌ లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయి ఓటమిపాలైంది. వీరిద్దరూ చెలరేగడంతో నేపాల్‌ 17వ ఓవర్‌లో 9 పరుగులు, 18వ ఓవర్‌లో 18, 19వ ఓవర్‌లో 15, 20వ ఓవర్‌లో 12 పరుగులు సాధించింది. చివరి ఓవర్‌లో దీపేంద్ర సింగ్‌ తొలి రెండు బంతులను బౌండరీ, సిక్సర్‌గా మలచి నేపాల్‌ శిబిరంలో గెలుపుపై ఆశలు రేకెత్తించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నెదర్లాండ్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. మైఖేల్‌ లెవిట్‌ (54), సైబ్రాండ్‌ ఎంజెల్‌బ్రెచ్ట్‌ (49), ఎడ్వర్డ్స్‌ (33), తేజ నిడమనూరు (31) రాణించగా.. మ్యాక్స్‌ ఓడౌడ్‌ (4) తక్కువ స్కోర్‌కు ఔటయ్యాడు. నేపాల్‌ బౌలర్లలో కరణ్‌, కుశాల్‌ మల్లా తలో వికెట్‌ పడగొట్టగా.. ఎడ్వర్డ్‌, తేజ రనౌట్‌ అయ్యారు. 

ఛేదనలో చివరి వరకు పోరాడిన నేపాల్‌.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 182 పరుగులకు పరిమితమైంది. దీపేంద్ర సింగ్‌, కరణ్‌తో పాటు ఆరంభంలో ఆసిఫ్‌ షేక్‌ (34), కెప్టెన్‌ రోహిత్‌ పౌడెల్‌ (50) రాణించారు. నెదర్లాండ్స్‌ బౌలర్లలో  వాన్‌ డర్‌ మెర్వ్‌, సైబ్రాండ్‌ చెరో  రెండు వికెట్లు పడగొట్టగా.. వివియన్‌ కింగ్మా, వాన్‌ డర్‌ గుగ్టెన్‌, ఆర్యన్‌ దత్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. ఈ టోర్నీలో భాగంగా నేపాల్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో నమీబియా ఆటగాడు లాఫ్టీ ఈటన్‌ 33 బంతుల్లోనే శతక్కొట్టిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ టీ20ల్లో ఇదే ఫాస్టెస్ట్‌ సెంచరీ.   


 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)