Breaking News

పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన నేపాల్‌

Published on Wed, 11/19/2025 - 21:10

తొలిసారి జరుగుతున్న మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పసికూన నేపాల్‌ పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. కొలొంబో వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 6 జట్లు (భారత్‌, పాకిస్తాన్‌, నేపాల్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ) పాల్గొంటున్న టోర్నీలో రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్‌ మెహ్రిన్‌ అలీ 77 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. రెండో అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (36) వచ్చాయి. పాక్‌ ఇన్నింగ్స్‌లో ఆరుగురు రనౌట్లయ్యారు.

అనంతరం ఛేదనలో నేపాల్‌ ఓపెనర్‌, కెప్టెన్‌ బినిత పున్‌ చెలరేగిపోయింది. 54 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసింది. మరో ఓపెనర్‌ మన్‌కేశీ ఛౌదరీ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అజేయమైన 43 పరుగులు చేసింది. 

ఫలితంగా నేపాల్‌ 13 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ టోర్నీలో భారత్‌ సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీకి భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 
 

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)