Breaking News

వికెట్‌ తీసిన ఆనందంలో అతి చేశాడు.. మైదానంలో నుంచి మోసుకెళ్లారు..!

Published on Mon, 12/02/2024 - 17:22

వికెట్‌ తీసిన ఆనందంలో బౌలర్లు సంబురాలు చేసుకోవడం సహజమే. అయితే ఓ బౌలర్‌ శృతి మించిన సంబురాలు అతన్ని మైదానంలో నుంచి మోసుకెళ్లేలా చేశాయి. వివరాల్లోకి వెళితే.. అండర్‌-19 ఆసియా కప్‌ టోర్నీలో ఆదివారం నేపాల్‌, బంగ్లాదేశ్‌ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ బౌలర్‌ యువరాజ్‌ ఖాత్రి వికెట్‌ తీసిన ‍ప్రతిసారి అతి సంబురాలు చేసుకున్నాడు. 

ఓసారి సౌతాఫ్రికా బౌలర్‌ తబ్రేజ్‌ షంషిలా షూ తీసి చెవి దగ్గర ఫోన్‌లా పెట్టుకోగా.. మరోసారి తనను అభినందించేందుకు వచ్చిన సహచరులకు దొరకకుండా పరుగులు పెట్టాడు. ఇలా చేసే క్రమంలో యువరాజ్‌ కాలు మడత పడింది. నడవలేని స్థితిలో ఉన్న యువరాజ్‌ను మైదానంలో నుంచి భుజాలపై మోసుకెళ్లారు. ఈ తంతుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.

బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో యువరాజ్‌ 4 వికెట్లతో మెరిసినా నేపాల్‌ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ 45.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌట్‌ కాగా.. బంగ్లాదేశ్‌ 28.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇదిలా ఉంటే, దుబాయ్‌ వేదికగా జరుగుతున్న అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ చేతిలో ఓటమిపాలైంది. టోర్నీలో భాగంగా ఇవాళ భారత్‌ జపాన్‌తో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యంగ్‌ ఇండియా.. కెప్టెన్‌ మొహమ్మద్‌ అమాన్‌ సెంచరీ చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. 

ఛేదనలో పూర్తిగా చేతులెత్తసిన జపాన్‌ 44 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో జపాన్‌ గెలవాలంటే 36 బంతుల్లో 231 పరుగులు చేయాల్సి ఉంది.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు