Breaking News

‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌ వాయిదా

Published on Sat, 05/10/2025 - 03:31

న్యూఢిల్లీ: భారతదేశంలో తొలిసారి నిర్వహించ తలపెట్టిన అంతర్జాతీయ జావెలిన్‌ టోర్నమెంట్‌ ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ ఈవెంట్‌ వాయిదా పడింది. భారత్, పాకిస్తాన్‌ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఈవెంట్‌ను వాయిదా వేశారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 24న బెంగళూరు వేదికగా ఈ మీట్‌ జరగాల్సి ఉండగా... భారత్, పాక్‌ దాడుల నేపథ్యంలో టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం నీరజ్‌ చోప్రా వెల్లడించాడు. 

‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ‘నీరజ్‌ చోప్రా క్లాసిక్‌’ తొలి ఎడిషన్‌ను వాయిదా వేశాం. ఈవెంట్‌లో పాల్గొనే అథ్లెట్లు, భాగస్వాముల క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయానికి వచ్చాం. త్వరలోనే తదుపరి కార్యచరణ వెల్లడిస్తాం. ఈ క్లిష్ట సమయంలో దేశంతో దృఢంగా నిలబడటం చాలా ముఖ్యం. ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో భద్రతా బలగాలు పోరాడుతున్నాయి. మేమంతా వారి వెంటే. జై హింద్‌’ అని నీరజ్‌ చోప్రా పేర్కొన్నాడు. 
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)