ఇంగ్లండ్ కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్‌..

Published on Tue, 04/29/2025 - 17:48

ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండ‌ర్ నాట్ స్కైవర్-బ్రంట్ ఎంపికైంది. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు మంగ‌ళ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించింది. హీథ‌ర్ నైట్ స్దానాన్ని స్కైవర్ బ్రంట్ భ‌ర్తీ చేయ‌నుంది. కాగా ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్సీ హీథ‌ర్ నైట్ రాజీనామా చేసింది.

మహిళల యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ ఘోర ప‌రాజ‌యం పాల‌వ్వ‌డంతో నైట్ ఈ నిర్ణ‌యం తీసుకుంది. అదేవిధంగా ప్ర‌ధాన కోచ్ జాన్ లూయిస్‌పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వేటు వేసింది. అత‌డి స్ధానంలో మాజీ కెప్టెన్ చార్లెట్ ఎడ్వర్డ్స్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నియ‌మించింది.

ఇక ఇంగ్లండ్ కెప్టెన్‌గా ఎంపిక అయిన త‌ర్వాత స్కైవర్-బ్రంట్ స్పందించింది. ఇంగ్లండ్ కెప్టెన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం నాకు ద‌క్కిన అరుదైన గౌర‌వంగా భావిస్తున్నాను. నేను ఎంతో అభిమానించే చార్లెట్ ఎడ్వర్డ్స్ సూచ‌న మెర‌కు నా ఈ కొత్త ప్ర‌యాణాన్ని ప్రారంభించ‌నున్నాను.

2013లో అరంగేట్రం నుంచి ఇంగ్లండ్ క్రికెట్‌కు నా వంతు స‌హ‌కారం అందించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాను. జట్టును విజయపథంలో నడిపించడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను అని బ్రంట్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. స్కైవర్-బ్రంట్‌కు కెప్టెన్‌గా అనుభ‌వం ఉంది.  హీథ‌ర్ నైట్ గైర్హ‌జ‌రీలో 11 టీ20ల్లో ఇంగ్లండ్ జ‌ట్టుకు సార‌థ్యం వ‌హించింది.
చ‌దవండి: సూర్యవంశీకి భారీ న‌జ‌రానా.. రూ.10 లక్షలు ప్రకటించిన బిహార్ సీఎం

#

Tags : 1

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)