Breaking News

అర్జున్‌ది అరుదైన ఘనత

Published on Mon, 10/28/2024 - 03:06

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెస్‌ సమాఖ్య (ఫిడే) లైవ్‌ ఎలో రేటింగ్స్‌లో తెలంగాణ స్టార్‌ చెస్‌ ప్లేయర్, గ్రాండ్‌మాస్టర్‌ ఇరిగేశి అర్జున్‌ 2800 పాయింట్ల మైలురాయిని అందుకోవడం అరుదైన ఘనత అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘2800 ఎలో రేటింగ్‌ మైలురాయిని చేరుకున్న అర్జున్‌కు అభినందనలు. ఇది అసాధారణ ఘనత. మొక్కవోని పట్టుదల, నిలకడైన ప్రదర్శనతోనే ఇది సాధ్యమవుతుంది. జాతి గర్వపడే క్షణాలివి. వ్యక్తిగతంగానూ గొప్ప స్థాయికి చేరావు. 

మరెంతో మంది యువత చెస్‌ ఆడేందుకు, ఈ క్రీడను ఎంచుకొని ప్రపంచ వేదికలపై రాణించేందుకు స్ఫూర్తిగా నిలిచావు. భవిష్యత్తులోనూ ఇదేరకంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ‘ఎక్స్‌’లో ట్వీట్‌ చేశారు. సెర్బియాలో జరిగిన యూరోపియన్‌ చెస్‌ క్లబ్‌ కప్‌ టోర్నీలో మూడు రోజుల క్రితం అర్జున్‌ 2800 ఎలో రేటింగ్స్‌ను అందుకున్నాడు. 

భారత్‌లో చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా, ఓవరాల్‌గా 16వ ప్లేయర్‌గా అర్జున్‌ గుర్తింపు పొందాడు. ఆదివారం యూరోపియన్‌ చెస్‌ క్లబ్‌ కప్‌ టోర్నీ ముగిశాక అర్జున్‌ లైవ్‌ రేటింగ్‌ 2800 లోనికి వచ్చింది. ప్రస్తుతం అతని లైవ్‌ రేటింగ్‌ 2798కు చేరింది. యూరోపియన్‌ చెస్‌ క్లబ్‌ కప్‌ టోర్నీలో అర్జున్‌ ప్రాతినిధ్యం వహించిన అల్కాలాయిడ్‌ క్లబ్‌ ఓపెన్‌ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది.   
 

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)