Breaking News

నమీబియా ఓపెనర్‌ అరుదైన ఫీట్‌.. టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలోనే

Published on Sun, 06/16/2024 - 17:08

నమీబియా ఓపెనర్‌ నికోలాస్ డేవిన్ అరుదైన రికార్డును నమోదు చేశాడు. టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన తొలి ఆటగాడిగా డేవిన్ రికార్డులకెక్కాడు. టీ20 ప్రపంచకప్‌-2024లో భాగంగా శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 'రిటైర్ అవుట్'గా వెనుదిరిగిన  డేవిన్.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత 10 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. అనంతరం 123 పరుగుల లక్ష్యచేధనలో నమీబియా ఓపెనర్‌గా వచ్చిన డేవిన్ తడబడ్డాడు. ఇంగ్లీష్‌ పేసర్లను ఎదుర్కొనేందుకు డేవిన్ తీవ్రంగా శ్రమించాడు. 

తన ఆడిన 16 బంతుల్లో కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో నమీబియా కెప్టెన్‌ ఎరాస్మస్‌.. డెవిన్‌ వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో డెవిన్‌ రిటైర్ట్‌ ఔట్‌గా డగౌట్‌కు చేరాడు. అతడి తన స్ధానంలో డేవిడ్‌ వైస్‌ క్రీజులోకి వచ్చాడు. 

అయితే 17 ఏళ్ల టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో ఏ బ్యాటర్‌ కూడా ఇలా రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరగలేదు. ఇక ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం నమీబియాపై 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)