Breaking News

బాధ్యతల నుంచి తప్పుకోనున్న బంగ్లాదేశ్‌ కెప్టెన్‌

Published on Sat, 10/26/2024 - 13:12

బంగ్లాదేశ్‌ ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ హొసేన్‌ షాంటో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తుంది. దక్షిణాఫ్రికాతో టెస్ట్‌ సిరీస్‌ అనంతరం షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలుగుతాడని సమాచారం. ఈ విషయాన్ని షాంటో ఇదివరకే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డుకు తెలియజేసినట్లు తెలుస్తుంది. 

ప్రస్తుతం బీసీబీ అధ్యక్షుడు ఫరూక్‌ అహ్మద్‌ విదేశాల్లో ఉన్నందున ఈ విషయంపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. షాంటోను ఈ ఏడాది ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌ ఆల్‌ ఫార్మాట్‌ కెప్టెన్‌గా నియమించారు. షాంటో ఏడాది పాటు కెప్టెన్‌గా కొనసాగుతాడని అప్పట్లో బీసీబీ వెల్లడించింది. 

అయితే షాంటో ఏడాది కూడా పూర్తి కాకుండానే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. షాంటో 2024 టీ20 వరల్డ్‌కప్‌ అనంతరమే కెప్టెన్సీ నుంచి వైదొలగాలని అనుకున్నాడు. అయితే అప్పట్లో అది కుదరలేదు. షాంటో కెప్టెన్సీ నుంచి వైదొలిగాక మెహిది హసన్‌ మిరాజ్‌ టెస్ట్‌, వన్డేలకు.. తౌహిద్‌ హ్రిదోయ్‌ టీ20లకు కెప్టెన్లుగా ఎంపిక కావచ్చు. 

షాంటో బంగ్లాదేశ్‌ను తొమ్మిది టెస్ట్‌ల్లో (మూడు విజయాలు, ఆరు పరాజయాలు), తొమ్మిది వన్డేల్లో (మూడు విజయాలు, ఆరు పరాజయాలు), 24 టీ20ల్లో (10 విజయాలు, 14 పరాజయాలు) ముందుండి నడిపించాడు. షాంటో సారథ్యంలో బంగ్లాదేశ్‌ ఇటీవల పాక్‌పై టెస్ట్‌ సిరీస్‌ విజయాన్ని సాధించింది. 
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)