Breaking News

ఊహించిందే జ‌రిగింది.. కెప్టెన్సీకి వీడ్కోలు ప‌లికిన స్టార్ ప్లేయ‌ర్‌

Published on Sat, 06/28/2025 - 13:19

అంతా ఊహించిందే జ‌రిగిందే. బంగ్లాదేశ్ క్రికెట్‌లో కెప్టెన్‌గా నజ్ముల్ హొస్సేన్ శాంటో ప్ర‌స్దానం ముగిసింది. ఇప్ప‌టికే టీ20, వ‌న్డే కెప్టెన్సీని కోల్పోయిన‌ శాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్య‌త‌లు నుంచి త‌ప్పుకున్నాడు. కొలంబో వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన రెండో టెస్టులో ఓట‌మి అనంత‌రం షాంటో త‌న నిర్ణ‌యాన్ని వెల్ల‌డించాడు. బంగ్లా క్రికెట్ బోర్డుతో విభేదాల కార‌ణంగా షాంటో ఈ నిర్ణ‌యం తీసుకున్నాడు.

టీ20 కెప్టెన్సీ నుంచి త‌నంత‌ట త‌నే త‌ప్పుకున్న శాంటో..  వ‌న్డే, టెస్టుల్లో సార‌థిగా కొన‌సాగాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. కానీ బీసీబీ మాత్రం అత‌డికి ఊహించ‌ని షాకిచ్చింది. ఈ నెల 12న అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసిన బంగ్లా క్రికెట్ బోర్డు.. అనూహ్యంగా వ‌న్డే జ‌ట్టు కెప్టెన్సీ నుంచి షాంటోని త‌ప్పించింది.

అతడి స్ధానంలో స్టార్ ఆల్‌రౌండర్ మెహదీ హసన్‌కు త‌మ వ‌న్డే కెప్టెన్‌గా బంగ్లా క్రికెట్ నియ‌మించింది. అప్ప‌టి నుంచి శాంటో బీసీబీ తీవ్ర ఆంస‌తృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాంటో టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. "ఇది వ్యక్తిగతం కాదు. జట్టు శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. 

గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ డ్రెసింగ్స్ రూమ్‌లో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనిపై బోర్డు ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదేమైన‌ప్ప‌టికి వారి నిర్ణయానికి మద్దతు ఇస్తాను" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్‌కాన్ఫ‌రెన్స్‌లో శాంటో పేర్కొన్నాడు. 

కాగా ప్ర‌స్తుతం బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా లిట్ట‌న్ దాస్ ఉండ‌గా.. వ‌న్డే కెప్టెన్‌గా మెహ‌దీ హ‌స‌న్ ఇటీవ‌లే ఎంపికయ్యాడు. ఇప్పుడు శాంటో రాజీనామా చేయ‌డంతో టెస్టు కెప్టెన్‌గా ఎవ‌రు బాధ్య‌త‌లు చేప‌డ‌తారో వేచి చూడాలి. శ్రీలంక‌తో తొలి టెస్టును డ్రా గా ముగించిన బంగ్లా టైగ‌ర్స్‌.. రెండో టెస్టులో మాత్రం ఘోర ఓట‌మి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 0-1తో బంగ్లాదేశ్ కోల్పోయింది.
చదవండి: గెలిచిన మ్యాచ్‌లు కంటే ఓడిందే ఎక్కువ.. గంభీర్‌పై తీవ్ర ఒత్తిడి: ఆకాష్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)